అనుష్క శెట్టి లాంగ్ గ్యాప్ తరువాత హీరోయిన్ గా చేస్తున్న సినిమా ”మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”.ఈ సినిమాలో జాతిరత్నాలు సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి సరసన నటిస్తుంది.ఈ సినిమా కోసం అనుష్క అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి విడుదల అయిన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఒకప్పుడు వరుసగా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది అనుష్క.బాహుబలి సినిమా తర్వాత ఈ భామ నిశ్శబ్దం అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో అనుష్క మాధవన్ కు జోడిగా నటించింది. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.ఆ తరువాత ఈ భామ కాస్త గ్యాప్ తీసుకుని ఈ సినిమాలో నటించింది. లాంగ్ గ్యాప్ తరువాత అనుష్క నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఆమె అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.కానీ ఫ్యాన్స్ కి ఈసారి కూడా నిరాశ ఎదురయ్యేలా కనిపిస్తుంది.
ఈ సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తుండగా రారా కృష్ణయ్య సినిమాతో దర్శకుడిగా మారిన మహేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఆగస్టు 4న విడుదల చేస్తామని అఫిషియల్ గా అనౌన్స్మెంట్ కూడా చేసారు. కానీ విడుదల సమయం దగ్గర పడుతున్నా ఈ సినిమా ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ప్రమోషన్స్ చేయకపోవడంతో ఈ సినిమాపై అంతగా బజ్ క్రియేట్ అవ్వలేదు.అయితే తాజాగా ఈ సినిమా వాయిదా పడబోతుందని అని అందుకే ప్రమోషన్స్ చేయడం లేదని ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ సినిమాకు ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉన్నాయని అందుకే ఈ సినిమా వాయిదా పడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ గాసిప్స్ కి చిత్ర యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
