Site icon NTV Telugu

Ministers Botsa: ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయి.. ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది..!

Botsa

Botsa

జీపీఎస్ పై ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసింది. ఈ మీటింగ్ దాదాపు నాలుగు గంటల పాటు కొనసాగింది. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం సృహుద్భావ వాతావరణంలో జరిగింది అని పేర్కొన్నారు. మేం గేట్లు తెరిస్తే వైసీపీ ఉండదు అని చంద్రబాబు అన్నారు.. చంద్రబాబు ముసలి నక్క, జిత్తులమారివి అని రాష్ట్ర ప్రజలకు తెలుసు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటు పొడిచి చావుకు కారణం.. చంద్రబాబుకు బుర్ర పాడైపోయిందా?.. అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Not Ramaiya Vastavaiya: ‘నాట్ రామయ్యా వస్తావయ్యా’ అంటూ రచ్చ రేపిన షారుఖ్ ఖాన్

వచ్చే ఎన్నికల్లో టీడీపీ కొట్టుకుపోవడం ఖాయం అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సీఎం జగన్ ప్రభుత్వం చేసిన సంక్షేమం పథకాల వల్లే ధైర్యంగా ఈ విషయం చెబుతున్నామని ఆయన వెల్లడించారు. చంద్రబాబు సంయమనం పాటించాలి.. చంద్రబాబు మిమ్మల్ని అనటం, మాతో అనిపించుకోవడం దేనికి?.. వయస్సు కాదు మనిషికి ఆలోచన ఉండాలి అని ఆయన అన్నారు. ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయి కదా.. ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది.. ఢిల్లీలో ఎవరి గేట్ల ముందు ఎవరు తిరుగుతున్నారు? అనేది తెలుస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉద్యోగులకు జగన్ సర్కార్ అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. ఎలాంటి సమస్యలున్నా.. సరే వెంటనే తీర్చేస్తామని ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Read Also: Vijay Devarakonda: ఆహా.. కొండన్న చేతిలో చెయ్యేసింది ఆమెనే.. ?

Exit mobile version