ఏపీలో పాదయాత్ర పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఏపీలో అమరావతి పాదయాత్రపై మంత్రులు తమదైన స్టయిల్ లో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు గ్రామంలో జగనన్న చేయూత కార్యక్రమంలో పాల్గొన్న జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అమరావతి రైతుల పాదయాత్రపై హాట్ కామెంట్స్ చేశారు. రైతుల పాదయాత్ర ఒళ్లు బలిసి చేస్తున్న పాదయాత్రగా ఆయన అభివర్ణించారు. కుప్పంలో చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదు, కుప్పంలో ఈసారి గెలిచేది వైసీపీనే అన్నారు.
తాజాగా మంత్రి మేరుగ నాగార్జున సైతం అమరావతి పాదయాత్రపై విరుచుకుపడ్డారు. PWD గ్రౌండ్ లో ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహా నిర్మాణ పనులను పరిశీలించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగర్జున త్వరలోనే నిర్మాణ పనులు పూర్తవుతాయన్నారు. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర రియల్ ఎస్టేట్ వారి కోసం అన్నారు. రైతుల పాదయాత్రలో అన్ని కులాల రైతులు ఉన్నారా? రియల్ ఎస్టేట్ వారి భూములను కాపాడుకునేందుకు పాదయాత్ర చేస్తున్నారు. కారులో వచ్చి యాత్రలో పాల్గొని మళ్ళీ కారెక్కి వెళ్తున్నారు. అమరావతి రైతులు చేసే ఉద్యమం రియల్ ఎస్టేట్ ఉద్యమం అని విమర్శించారు.
Read Also: Rega Kantha Rao: బీజేపీ చావు కబురు చల్లగా చెప్తోంది
మూడు ప్రాంతాల అభివృద్ధి వారికి అవసరం లేదు. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టుకుని ఎవరిని రెచ్చగొట్టడానికి ఈ యాత్ర చేస్తున్నారు. రాజధానిలో అంబేద్కర్ విగ్రహం ముళ్ళ పొదల్లో ఊరి చివర పెట్టాలని చూశారు. అప్పుడు ఈ దళిత నేతలు ఎందుకు చంద్రబాబును ప్రశ్నించలేదు? మా కులాన్ని, మా దేవుడ్ని చంద్రబాబు అవమానించారు. జీవితాంతం దళితులు చంద్రబాబును వ్యతిరేకిస్తూనే ఉంటారన్నారు మంత్రి నాగార్జున.
Read Also: Brahmotsavalu in Tirumala: ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం.. బ్రహ్మోత్సవాల సందేశం..
