Site icon NTV Telugu

Errabelli Dayakar Rao : ప్రతీ ఇంటికి జాతీయ జెండా ఉండాలి

Errabelli Dayakar Rao

Errabelli Dayakar Rao

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అజాది కా అమృత్‌ మహోత్సవం పేరిట ఉత్సవాలు నిర్వహిస్తోంది. అయితే.. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహం పేరిట స్వాతంత్ర్య వేడుకలను నిర్వహిస్తోంది. అయితే ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల నిర్వహణ కు పక్కా ప్రణాళిక రూపొందించి కార్యక్రమలను నిర్వహించాలని వెల్లడించారు. 9వ తేదీన ఇంటి ఇంటికి జాతీయ జెండా ను అందించాలని తెలిపారు.

ప్రతీ ఇంటికి జాతీయ జెండా ఉండాలని ఆయన అన్నారు. నియమ, నిబంధనలని అనుసరించి ప్రతీ ఇంటి మీద జెండా ఎగురవేయాలని ఆయన సూచించారు. పెద్ద ఎత్తున ప్రతీ గ్రామంలో ఒక ఉత్సవంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహం వేడుకలు జరగాలన్నారు. ప్రతీ గ్రామానికి ఒక పోలీస్ అధికారి ఉండాలని, ప్రజా ప్రతినిధులతో కో ఆర్డినేట్ చేసుకుంటూ వారి భాగస్వామ్యంతో వేడుకలు ఘనంగా జరిగేలా చూడాలని ఆయన ఆదేశించారు. ఫ్రీడమ్ పార్క్ ను ప్రారంభించాలన్నారు మంత్రి దయాకర్‌ రావు.

Exit mobile version