Site icon NTV Telugu

Minister Audimulapu Suresh: రాజధాని విషయంలో సుప్రీం ఆదేశాలను పాటించాల్సిందే..

Adimulapu Suresh

Adimulapu Suresh

Minister Audimulapu Suresh: పొరుగు రాష్ట్ర రాజకీయాలతో తమకు సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ పురపాలక , పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసే కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా తాము విమర్శిస్తామన్నారు. రాజ్యాంగబద్దంగా పరిపాలన జరుగుతుంది కాబట్టే దానికి వ్యతిరేకంగా ఎక్కడ జరిగినా అది కరెక్ట్ కాదని తాము వ్యతిరేకిస్తామని వెల్లడించారు. బాధితులకు తమ సానుభూతి ఉంటుందన్నారు. వివేకానందరెడ్డి తమ నాయకుడన్న ఆయన.. వివేకా హత్య కేసులో దోషులు ఎవరో తేల్చాల్సిందేనని స్పష్టం చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందన్నారు.

Chandrababu: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. ”నన్ను, లోకేష్‌ని కూడా చంపేస్తారట..”

ఒకే ప్రాంతంలో రాజధాని నిర్మాణం కరెక్ట్ కాదని సుప్రీం కోర్టు చెప్పిందని.. కోర్టులు ఇచ్చిన ఆదేశాలను శిరసావహించాల్సిన బాధ్యత ఉందన్నారు. జనసేన పార్టీ భావజాలం ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలియాలని మంత్రి పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోయడమే అజెండా అనడం విడ్డూరంగా ఉందన్నారు. 2019 ఎన్నికల్లో ఒక్క చోట కూడా పవన్ కళ్యాణ్ గెలవలేకపోయాడని మంత్రి ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో 175 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version