NTV Telugu Site icon

Minister Amarnath: ప్రతిపక్షాల గొంతు నొక్కాల్సిన అవసరం మాకు లేదు..

Amarnath

Amarnath

ఎన్టీవీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. అక్టోబర్ 23 విజయదశమి నుంచి విశాఖపట్నం నుంచే సీఎం జగన్ పాలన చేస్తారు అని పేర్కొన్నారు. ఏర్పాట్ల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు అని అమర్నాథ్ వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం ఏపీలో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది.. ఒకవేళ కేంద్రం ముందస్తుకు వెళితే రాష్ట్రం కూడా అనుసరించాల్సి ఉంటుంది.. స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్ కుంభకోణాలను గత అసెంబ్లీ సమావేశాల్లోనూ చర్చించాం.. సభ్యుల సంఖ్యను బట్టే అసెంబ్లీలో సమయం కేటాయిస్తారు.. ప్రతిపక్షాల గొంతు నొక్కి ల్సిన అవసరం మాకు లేదు అని మంత్రి గుడివాడ అమర్నార్ అన్నారు.

Read Also: Viral Video : ఏంది భయ్యా ఇది..సాస్ ఏమోగానీ కళ్లు పోవడం పక్కా.. వీడియో చూస్తే మైండ్ బ్లాకే..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన తప్పులకే ఇప్పుడు శిక్షను అనుభవిస్తున్నాడు అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆయనపై కావాలని ప్రభుత్వం కక్షగట్టి కేసులు ఎందుకు పెడుతుందని మంత్రి చెప్పుకొచ్చారు. ఒక వేళ మేము చంద్రబాబు మీద పగతీర్చుకోవాలనుకుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనపై అక్రమ కేసులు పెట్టేవాళ్లం కదా అంటూ అడిగారు. చంద్రబాబు తరపున పెద్ద పెద్ద లాయర్ల వాదిస్తున్నారు.. చంద్రబాబు తప్పు చేయకుంటే ఆయనకు ఎందుకు భయం.. బాబుపై ఉన్న ఆరోపణలు నిజం కాబట్టే ఈ కేసు ఇంకా కొనసాగుతుంది అని మంత్రి పేర్కొన్నారు. ప్రజల సొమ్మును చంద్రబాబు దొచుకోవడం వల్లే ఇప్పుడు శిక్షను అనుభవిస్తున్నాడు అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.

Read Also: Egyption Treasures: ఈజిప్టులో బయటపడిన పురాతన ఆలయం.. గుప్త నిధులు లభ్యం