NTV Telugu Site icon

Microsoft Outage : ప్రపంచ వ్యాప్తంగా క్రాష్ అయిన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్.. లైవ్ అప్ డేట్స్

New Project 2024 07 19t142754.557

New Project 2024 07 19t142754.557

Microsoft Outage : మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా గందరగోళం నెలకొంది.. ఇది ముంబై నుండి బెర్లిన్ వరకు ఎయిర్‌లైన్స్ నుండి బ్యాంకింగ్, స్టాక్ ఎక్స్ఛేంజీల వరకు అన్నింటిని ప్రభావితం చేసింది. మైక్రోసాఫ్ట్‌లో సమస్య కారణంగా ముంబై ఎయిర్‌పోర్ట్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో విమానాలు టేకాఫ్ కావడం లేదు. సాంకేతిక సమస్యల కారణంగా విమానాశ్రయం మాత్రమే కాకుండా స్టాక్ మార్కెట్, బ్యాంకులు అన్నీ నిలిచిపోయాయి. మైక్రోసాఫ్ట్ కూడా దీని కారణంగా భారీ నష్టాలను చవిచూసింది. కంపెనీ షేర్లలో 0.78 శాతం క్షీణత నమోదైంది. భారతదేశంలో మైక్రోసాఫ్ట్ సమస్యల కారణంగా ముంబై విమానాశ్రయంలో చెక్-ఇన్ సిస్టమ్ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో స్పైస్‌జెట్, ఇండిగో, ఎయిర్ ఇండియా, అకాస సహా అన్ని విమానయాన సంస్థల కార్యకలాపాలు దెబ్బతిన్నాయి.