NTV Telugu Site icon

Mickey Arthur: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ఆ జట్టుకు ఆన్‌లైన్ కోచ్‌!

11

11

ప్రపంచ క్రికెట్‌లోనే తొలిసారి ఓ అంతర్జాతీయ జట్టుకు ఆన్‌లైన్ కోచ్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. టీమ్‌ను మళ్లీ విక్టరీల బాట ఎక్కించేందుకు పాత కోచ్‌తో మంతనాలు జరుపుతోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అతడెవరో కాదు పాక్‌ క్రికెట్‌కు ఇప్పటికే సేవలందించిన మిక్కీ ఆర్థర్. ప్రపంచ క్రికెట్‌లోని సక్సెస్ ఫుల్ కోచ్‌ల్లో ఆర్థర్ కూడా ఒకరు. కోచ్‌గా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, శ్రీలంకలాంటి జట్లకు అంతర్జాతీయ క్రికెట్‌లో మంచి సక్సెస్ సాధించి పెట్టాడు. గతంలో పాకిస్తాన్ టీమ్‌కూ కోచ్‌గా వ్యవహరించాడు. అయితే ఇప్పుడు మరోసారి అతనికే కోచింగ్ అవకాశం ఇవ్వాలని పీసీబీ భావిస్తోంది.

Graham Reid: వరల్డ్‌కప్‌లో ఓటమి.. టీమిండియా కోచ్ రాజీనామా

అయితే, ఈసారి ఆర్థర్ పూర్తిగా పాక్ టీమ్‌తో ఉండేది అనుమానంగా కనిపిస్తోంది. అతడు ఆన్‌లైన్‌లో కోచింగ్ ఇచ్చే అవకాశం ఉందని పాక్ మీడియా చెబుతోంది. చాలా వరకూ ఆన్‌లైన్ కోచింగ్‌కే పరిమితమయ్యే మిక్కీ ఆర్థర్.. అప్పుడప్పుడూ టీమ్‌తో చేరతాడని వెల్లడించింది. అయితే ఈ ఏడాది చివర్లో ఇండియాలో జరగబోయే వరల్డ్ కప్‌కు మాత్రం ఆర్థర్ టీమ్‌తో ఉంటాడని తెలిపింది. ప్రస్తుతం మిక్కీ ఆర్థర్ డెర్బీషైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌కు ఫుల్ టైమ్ కోచ్‌గా సేవలందిస్తున్నాడు. ఇప్పుడు పాక్ టీమ్ కోచ్ పదవి దక్కిన తర్వాత కూడా అతడు అక్కడే కొనసాగనున్నాడు. ఆర్థర్‌కు ఓ అసిస్టెంట్‌ను పాక్ క్రికెట్ బోర్డు నియమించనుంది. ఆ అసిస్టెంట్ కోచ్ మాత్రం ఎప్పుడూ పాక్ టీమ్‌తోనే ఉంటాడు.

Murali Vijay: క్రికెట్‌కు మురళీ విజయ్ గుడ్‌బై.. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్

ఈ విషయమై స్పందిస్తూ “నేను నేరుగా మిక్కీతోనే చర్చలు జరుపుతున్నాను. ఇప్పటికే 90 శాతం చర్చలు పూర్తయ్యాయి. చాలా విషయాలపై చర్చించాం. త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతాం. మిక్కీ వస్తే తన టీమ్‌ను తాను తయారు చేసుకుంటాడు. మేము కేవలం ఎంత ఇవ్వాలన్నది నిర్ణయించాల్సి ఉంటుంది. 2-3 రోజుల్లో ఆ పని పూర్తవుతుంది” అని నజమ్ సేతీ వెల్లడించారు.