NTV Telugu Site icon

Melinda Gates dating: మాజీ రిపోర్టర్‌తో బిల్‌ గేట్స్‌ మాజీ భార్య.. 58 ఏళ్ల వయస్సులో కొత్త ప్రియుడు!

Melinda Gates

Melinda Gates

Melinda Gates dating: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌ నుంచి విడాకులు తీసుకున్న ఆమె మరొకరితో ప్రేమలో ఉన్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. 1994లో వైవాహిక బంధంతో ఒకటైన వీరు… 27 ఏళ్ల అనుబంధానికి ముగింపు పలికి అందరికీ షాక్ ఇచ్చారు. బిల్ గేట్స్ తో విడిపోయిన తర్వాత తాను ఎంతో మనోవేదనకు గురయ్యానని మిలిందా ఒక ఇంటర్వ్యూలో కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మరోసారి ప్రేమలో పడినట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

Sunill Gavaskar: ఇక సీనియర్ల రిటైర్మెంట్లు ఉండొచ్చు.. హార్దిక్‌కు కెప్టెన్సీ!

గత కొన్ని నెలలుగా ఫాక్స్ న్యూస్‌కి మాజీ కరస్పాండెంట్ అయిన జాన్ డ్యూ ప్రీతో డేటింగ్ చేస్తోందనే వార్త వైరల్ అవుతోంది. జాన్‌ ఇప్పుడు కమ్యూనికేషన్స్ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఈ జంట ఒకరినొకరు ఎంతకాలంగా ప్రేమించుకుంటున్నారన్నది మాత్రం తెలియలేదు. అయితే 58 ఏళ్ల మిలిందాగేట్స్ , 60 ఏ్వ జాన్‌ డ్యూ ప్రీ ఏప్రిల్‌లో నెట్స్, సెల్టిక్స్ గేమ్‌లో కలిసి ఉన్నప్పుడు ఓ ఫోటో ఒకటి వైరల్‌ అవుతోంది. కాలిఫోర్నియాలోని న్యూపోర్ట్ బీచ్‌లోని 5-నక్షత్రాల హోటల్ పెలికాన్ హిల్‌లో ఈ జంట, వారి కుటుంబాలలోని కొంతమంది సభ్యులతో పాటు బస చేసినట్లు కూడా అవుట్‌లెట్ నివేదించింది. వీరిద్దరూ కలిసి ఇప్పటికే పలు మార్లు మీడియా కంటికి చిక్కారు. మరోవైపు, ఈ కథనాలపై మిలిందా కానీ, జాన్ డ్యూ ప్రీకానీ ఇంతవరకు స్పందించలేదు. దీంతో, ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్టయింది. మరోవైపు, బిల్ గేట్స్, మిలిందాకు ముగ్గురు సంతానం ఉన్నారు.

Show comments