NTV Telugu Site icon

Chiranjeevi: మెగా విశ్వంభరుడు.. బర్త్ డే స్పెషల్

Megastar

Megastar

Megastar Chiranjeevi Birthday Special: కొణిదెల శివశంకర వరప్రసాద్ అంతగా తెలియదేమో గాని మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారు ఉండరు. తన నటన, డాన్స్, ఫైట్స్ తో యావత్ సినీ ప్రపంచాన్ని శాసించాడు చిరు. 1974 ఆగస్టు 22న మొగల్తూరులో అంజనా దేవి, వెంకట్రావు దంపతులకు జన్మించాడు వరప్రసాద్. ఏ ముహూర్తాన నాడు వరప్రసాద్ అనే పేరు పెట్టారో కానీ నేడు కొన్ని కోట్ల మంది అభిమానుల హృదయాల్లో కళామతల్లి వరప్రసాదంగా చిరస్థాయిగా నిలిచిపోయారు మెగాస్టార్.

తొలి అడుగు –

చెన్నై లోని మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తర్వాత పునాది రాళ్ళు చిత్రంతో చిత్ర సీమలో అడుగుపెట్టిన చిరంజీవి, కెరీర్ తొలినాళ్లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన ప్రయాణం మొదలుపెట్టారు. ఎన్నో కష్టాలు మరెన్నో సవాళ్లు, అవమానాలు ఎదురైనా ఎక్కడా కృంగిపోకుండా, లక్ష్య సాధనకై పిడికిలి బిగించి, అకుంఠిత దీక్షతో, పట్టువిడవకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని నటనలో శిఖరాగ్రాన్ని అధిరోహించారు చిరు. బాపు దర్శకత్వంలో వచ్చిన మనవూరి పాండవులు చిత్రం చిరంజీవికి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపునిచ్చింది. హీరోగా ఎదుగుతున్న క్రమంలో 1980 ఫిబ్రవరి 20 న చిరంజీవి వివాహం హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో జరిగింది. సురేఖ రాకతో చిరుకు అన్ని మంచి శకునములే అని చెప్పాలి.

సక్సెస్ జర్నీ – 

1982లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సూపర్ హిట్ సక్సెస్ జర్ని స్టార్ట్ అయింది. తర్వాత కె. విశ్వనాథ్ దర్శకత్వంలో శుభలేఖ చిత్రంలో చిరు అద్భుత నటనకు గాను ఉత్తమ నటుడిగా తెలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు చిరు. ఆ తర్వాతి ఏడాది అనగా 1983లో ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయం సాధించి చిరంజీవిని కాస్త సుప్రీమ్ హీరో చిరంజీవిగా మార్చింది. అక్కడి నుండి చిరు వెనుదిరిగి చూసుకోలేదు. పసివాడి ప్రాణం చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమకు మొదటిసారిగా బ్రేక్ డ్యాన్స్ పరిచయం చేశారు గ్రేసింగ్ స్టార్. 1990లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో జగదేకవీరుడు అతిలోకసుందరి ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. గ్యాంగ్ లీడర్, అత్తకు యముడు అమ్మాయికి మెుగుడు, విజేత, రుద్రవీణ వంటి వరస హిట్స్ తో మెగాస్టార్ గా అవతరించారు చిరంజీవి. 2002లో వచ్చిన ఇంద్ర అప్పటివరకు ఉన్న రికాడ్స్ బద్దలు కోట్టి ఇండస్ట్రి హిట్ గా నిలిచింది.

నటనకు విరామం –

కెరీర్ పీక్స్ లో ఉండగా 2007లో ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ తర్వాత సుమారు పదేళ్ల పాటు మరే సినిమాలో నటించలేదు మెగాస్టార్. అప్పట్లో ఇక అభిమాన నటుడిని సిల్వర్ స్కీన్ పై చూడలేమని ఆయన అభిమానులు ఆందోళ చెందారు. సినమాలు ఆపోద్దని విన్నవించారు.

రాజకీయ ప్రవేశం –

తనను ఎంతో ఆదరించిన తెలుగు ప్రజలకు సేవ చేసుకునేందుకు సినిమాలు వదిలేసి రాజకీయాలలో అడుగుపెట్టారు చిరంజీవి. 2008 ఆగస్టు 26 న మదర్ థెరిసా జన్మదినం సందర్భంగా ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించారు చిరు. 2009 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఓటమి, పాలకొల్లులో ఓటమి ఇలా రకరకాల కారణాలతో తన పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేసారు చిరంజీవి. ఆ తర్వత రాజకీయాల నుండి తప్పుకుని తిరిగి కళామతల్లి ఒడికి చేరుకున్నారు.

బాస్ ఈజ్ బ్యాక్  –
పది సంవత్సరాల గ్యాప్ తర్వత మళ్లి ముఖానికి రంగన వేసుకుని ఖైదీ నెం.150లో నటించారు చిరు. 2017 జనవరి 11 న విడుదల అయన ఈ సినిమా చిరులో గ్రేస్, నటనలో వాడి వేడి ఏ మాత్రం తగ్గలేదని నిరూపించి సూపర్ హిట్ సాధించింజి. ప్రస్తుతం విశ్వంభర అనే పీరియాడికల్ సినిమాలో నటిస్తున్నాడు బాస్..

సేవా కార్యక్రమాలు –

సినిమాలోలతో పాటు సేవా కార్యక్రమాల్లోను మెగాస్తార్ ఎప్పుడూ ముందుంటారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు 1998లో అక్టోబరు 2న ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్’ స్థాపించారు. ‘చిరంజీవి బ్లడ్ బాంక్’, ‘చిరంజీవి ఐ బాంక్’ వంటి సేవా సంస్థలు స్థాపించి ఎందరో జీవితాలలో వెలుగులు నింపి జై చిరంజీవిగా విరాజిల్లుతున్నారు.

ఈ ఆగస్టు 22 న 70 వ పడిలో అడుగెడుతున్న మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదగడం, తమ్ముడు పవన్ కళ్యాన్ డిప్యూటి సీఎంగా ఎన్నికవడం వంటి మొమరబుల్ మూమెంట్స్ తో ఈ జన్మదిన వేడుకలు చేసుకుంటున్నారు. అయిన స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి సినీజీవితాన్ని పూనాదిరాళ్ల నుండి వివరించాలంటే ఒక పుస్తకం సరిపోదు. ఇండస్ట్రీలో ఏదో సాధించాలనే వచ్చే ఎందరో కళాకారుల కళలకు కేరాఫ్ గా నిలిచిన జగదేక వీరునికి జన్మదిన శుభాకాంక్షలు .

Show comments