NTV Telugu Site icon

65 Weds 16 : నీకు సుడి ఉంది తాత..ఈ వయస్సులో 16ఏళ్ల పిల్లతో మూడోసారా !

Brazil Mayor

Brazil Mayor

65 Weds 16 : బ్రెజిల్ దేశానికి చెందిన 65 సంవత్సరాల నగర మేయర్ 16 ఏళ్ల యువతిని వివాహం చేసుకున్నాడు. వినడానికి అశ్చర్య కరంగా ఉన్నా ఇది నిజం. వివాహం చేసుకోవడమే కాదు.. ఆ యువతి తల్లికి సాంస్కృతిక, పర్యటక శాఖ కార్యదర్శిగా నియమించుకున్నారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో దీనిపై అక్కడ పెద్ద చర్చ నడుస్తోంది. వివరాల్లోకి వెళితే.. దక్షిణ బ్రెజిల్​లోని అరౌకారియా నగరానికి చెందిన హిస్సామ్​ హుస్సేన్​ దేహైని అతడో మేయర్. అతడి వయసు 65ఏళ్లు. అప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగాయి. ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చాడు. మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఆ లేటు వయస్సులో 16 ఏళ్ల యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వెంటనే అత్తకు పెద్ద ప్రమోషన్ ఇచ్చాడు. అతడు వివాహమాడిన యువతి పేరు కౌనే రోడ్ కమర్గో. ఉన్నత పాఠశాల విద్యార్థి అయిన ఆమె.. గతేడాది మిస్ అరౌకారియా పోటీలో టీన్ విభాగంలో పాల్గొని రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఆమెకు ‘టీన్ ప్రిన్సెస్’ అవార్డు లభించింది.

Read Also:Shriya saran: మరీ ఇంత అందమా! శ్రియ సోయగాలకు రెప్ప వాల్చడం కష్టమే..

మేయర్ హిస్సామ్, కౌనే రోడ్ కమర్గో మొదటిసారిగా ఓ సామాజిక కార్యక్రమంలో కలుసుకున్నారు. తరువాత మధ్య ప్రేమ మొదలైంది. దీంతో వారిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. బ్రెజిల్ ఉన్న చట్టాల ప్రకారం 16 ఏళ్ల దాటిన బాలికలను తల్లిదండ్రుల పర్మీషన్ తో ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు. అయితే అతడు రెండో సారి అదే నగరానికి మేయర్ గా కొనసాగుతున్నాడని, రెండో భార్యకు కొంత కాలం కిందట విడాకులు ఇచ్చాడని నివేదికలు చెబుతున్నాయి. ఏప్రిల్ 12న వీరిద్దరికీ వివాహం జరిగింది. మరుసటి రోజే కౌనే తల్లి మారిలీన్ రోడ్ అరౌకారియా సాంస్కృతిక, పర్యటక శాఖ కార్యదర్శిగా ప్రమోషన్ పొందారు. ఆమె అంతకు ముందు జనరల్ సెక్రటరీగా పని చేసేవారు. అయితే కొత్త అత్తగారికి ప్రమోషన్ ఇవ్వడం పట్ల అక్కడ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రతిపక్ష సభ్యులు దీనిపై ప్రశ్నించడంతో అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు.

Read Also:Weather Latest Update: నేడు ఈ జిల్లాల్లో కుండపోతే! ఐఎండీ వెల్లడి

Show comments