Site icon NTV Telugu

japan: జపాన్‌లో భారీ భూకంపం.. ప్రజలు అప్రమత్తత

Japanw

Japanw

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6 తీవ్రత నమోదైంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

గురువారం సాయంత్రం జపాన్‌లో 6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం భూకంపం యొక్క కేంద్రం ఫుకుషిమా ప్రిఫెక్చర్ తీరంలో గుర్తించారు. దీంతో బలమైన ప్రకంపనలు జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని ఏజెన్సీ తెలిపింది.

ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సిన అవసరం ఉంది. జపాన్‌కు పలుమార్లు భూకంపం రావడం అనేది విరివిగా జరుగుతుంటాయి.

ఇదిలా ఉంటే మార్చి నెల ప్రారంభంలోనే జపాన్‌లోని ఇచినోమియా సమీపంలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5.45 గంటలకు 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. టోక్యో, అసహి, ఒహారాలో ప్రకంపనలు సంభవించాయి. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంపం 23 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఈ భూకంపం తర్వాత అనేక మంది నివాసితులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లినట్లు సమాచారం.

 

Exit mobile version