మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. భాను భోగవరపు అనే కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. క్రాక్ తర్వాత ఆ స్థాయి హిట్ కొడతాడని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
గత ఏడాది దీపావళికి రిలీజ్ కావాల్సిన సినిమా.. అనేక వాయిదాలు, రిషూట్లు అనంతరం ఈ నెల 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. అయితే మాస్ జాతర సినిమాను రిలీజ్ రోజు కంటే ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ వేస్తానని ప్రకటించారు నాగవంశీ. అయితే అదే రోజు SS రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ సినిమా బాహుబలి రెండు పార్ట్స్ ను ఎపిక్ రూపంలో ఒకే సినిమాగా రీరిలీజ్ చేస్తున్నారు. దాంతో ఇప్పుడు మాస్ జాతర రిలీజ్ ను ఒకరోజు పోస్ట్ పోన్ చేయాలనీ ఆలోచనలో ఉన్నారట. బాహుబలి ఎపిక్ ఒకరోజు ముందుగా అంటే అక్టోబరు 30న రాత్రి ప్రమియర్స్ తో రిలీజ్ చేస్తే మాస్ జతరను 31 రాత్రి ప్రీమియర్స్ వేసి నవంబర్ 1st నుండి రెగ్యులర్ షో వేయాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం అబ్రాడ్ లో షూట్ లో ఉన్న రాజమౌళి తిరిగి వస్తే బాహుబలి ఎపిక్, మాస్ జాతర రిలిజ్ పై ఒక క్లారిటీ వస్తుంది. ఇక ఈ నెల 27న మాస్ జాతర ట్రైలర్ రాబోతుంది.
