మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. భాను భోగవరపు అనే కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. క్రాక్ తర్వాత ఆ స్థాయి హిట్ కొడతాడని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
Also Read : Sharwanand : వరుస సినిమాలు చేస్తున్న శర్వా.. హిట్ కొట్టేది ఎప్పుడు?
గత ఏడాది దీపావళికి రిలీజ్ కావాల్సిన సినిమా.. అనేక వాయిదాలు, రిషూట్లు అనంతరం ఈ ఏడాది దీపావళి తర్వాత వస్తోంది. ఈ నెల 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న మాస్ జాతర కోసం రవితేజ కూడా రంగంలోకి దిగి ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ చిత్ర నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో మాస్ జాతర సినిమాను రిలీజ్ రోజు కంటే ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ వేస్తానని ప్రకటించారు. ఈ విషయంలో నాగవంశీ రిస్క్ చేస్తున్నాడని ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. రవితేజ గత చిత్రం మిస్టర్ బచ్చన్ ప్రీమియర్స్ రిజల్ట్ డే 1 కలెక్షన్స్ పై ఎలాంటి ప్రభావం చూపిందో తెలిసిందే. ప్రీమియర్స్ ఒకందుకు మంచిదే.. టాక్ బాగుంటే డే 1 కలెక్షన్స్ భారీగా ఉంటాయి. కానీ అదే ప్రీమియర్స్ టాక్ తేడా వాస్తే రిలీజ్ కలెక్షన్స్ పై ఆ ప్రభావం గట్టిగా ఉంటుంది. ఎలాగు సోలో రిలీజ్ కాబట్టి ప్రీమియర్స్ తో రిస్క్ ఎందుకు అని ట్రేడ్ భావిస్తోంది.
