Site icon NTV Telugu

Pakistan: పొరుగు దేశాల సంబంధాలపై నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె కీలక వ్యాఖ్యలు

Mr

Mr

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ కుమార్తె, పంజాబ్ ప్రావిన్స్‌ ముఖ్యమంత్రి మరియం నవాజ్‌ పొరుగు దేశాలతో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగున ఉన్న దేశాలతో ఘర్షణ పడొద్దని.. స్నేహంగా ఉండాలని వ్యాఖ్యానించారు. హృదయం తలుపులు తెరవాలంటూ శాంతి వచనాలు పలికారు. ఈ మాటలు తన తండ్రి మాటలని ఆమె చెప్పుకొచ్చారు.

ఇది కూాడా చదవండి: Nindha: ‘నింద’ పడిందంటున్న వరుణ్ సందేశ్

తాను ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు.. పంజాబీ సోదరుల నుంచి శుభాకాంక్షలు అందాయని తెలిపారు. తాను పాకిస్థానీని.. అలాగే పంజాబీని కూడా అని చెప్పారు. భారత పంజాబీల్లానే తాము కూడా ఆ భాష మాట్లాడాలనుకుంటున్నామని పేర్కొన్నారు. మా తాత మియాన్‌ షరీఫ్‌.. అమృత్‌సర్‌లోని జాటి ఉమ్రాకు చెందినవారని గుర్తుచేశారు. ఒక పంజాబీ భారతీయుడు జాటీ ఉమ్రా నుంచి మట్టిని తీసుకువచ్చినప్పుడు దానిని మా తాత సమాధి దగ్గర ఉంచినట్లు వ్యాఖ్యానించారు. భారత్‌ నుంచి కర్తార్‌పుర్ సాహిబ్ గురుద్వారాను దర్శించుకోవడానికి వచ్చిన సిక్కులను ఉద్దేశించి మరియం నవాజ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

గత ఫిబ్రవరిలో మరియం పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. పాకిస్థాన్‌ చరిత్రలో ఒక రాష్ట్రానికి మహిళ ముఖ్యమంత్రి కావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఆమె పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. మరోవైపు పాకిస్థాన్‌ ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేసేవరకు ఆ దేశంతో చర్చలు ఉండవని భారత్ తేల్చిచెప్పింది.

 

Exit mobile version