NTV Telugu Site icon

viral video : పెళ్లి పీటల మీదే ఆ పనికానిచ్చిన వరుడు.. వధువు ఏం చేసిందో తెలిస్తే నవ్వాగదు..

Mrg

Mrg

ఈ మధ్య కాలంలో పెళ్లికి సంబందించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి.. అందులో కొన్ని వీడియోలను చూస్తే నవ్వాగదు.. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో వరుడు చేసిన పనికి గూబ గుయ్యి మనింది..

విషయానికొస్తే.. ఓ వధువు పెళ్లి పీటలమీద కూర్చుని కాసేపట్లో తాళి కట్టే వరుడిని చెంప ఛెళ్లుమనిపించింది. అంతేకాదు ఆమె పక్కన కూర్చున్న వ్యక్తిని కూడా ఒక్కటి పీకింది.కోపంతో ఎడంచేత్తో తన పక్కన కూర్చున్నవాడికి ఒక్కటిచ్చింది. ఆ తరువాత పెళ్ళికొడుకు చెంప ఛెళ్లుమనిపించింది. దీంతో పెళ్లికొచ్చిన అమ్మాయిలంతా పగలబడి నవ్వారు. ఇంతకీ ఆ వధువు వరుడ్ని ఎందుకు కొట్టిందో తెలిస్తే అబ్బాయిలంతా కాస్త కుదురుగా ఉండే అవకాశం లేకపోలేదు.. మరి పెళ్లికొడుకు ఎలా ఉండాలి? చక్కగా బుద్దిగా ఉండాలి. కానీ ఓ ప్రబుద్ధుడు మాత్రం పెళ్లి పీటలమీదే కాస్త ఓవర్ చేశాడు. కాబోయే భార్య చేతి దెబ్బ రుచి చూశాడు.. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది..

ఈ వైరల్ అవుతున్న వీడియోను చూస్తుంటే ఇది నార్త్ లో జరిగినట్లు తెలుస్తుంది.. గుట్కా నములుతూ కులాసాగా కూర్చున్నాడు. బుగ్గను అటూ ఇటూ ఆడిస్తు చక్కగా నములుతున్నాడు. దీంతో పెళ్లికూతురికి చిర్రెత్తింది. అంతలోనే ఆమె పక్కనే కూర్చున్న వ్యక్తం ఆమెకు ఏదో చెప్పాడు. అంతే అతడిని లాగి ఒక్కటిచ్చింది. తర్వాత గుట్కా తింటున్న వరుడివైపు తిరిగి ఎడమ చేత్తో ముఖమ్మీద ఫెటీల్మని కొట్టింది. చెంప పగలడంతో తప్పు అనుకున్నాడో లేదా ఎదురుతిరిగితే మరొకటి ఇస్తుందనుకున్నాడో గానీ చెంప ఛెళ్లుమన్నా కిక్కురుమనలేదు. నోరు మూసుకుని పెళ్లిపీటల మీద నుంచి లేచి నోట్లోని గుట్కాను పక్కన ఉమ్మాడు. వరుడిని చూసిన అక్కడి అమ్మాయిలంతా పగలబడి నవ్వినట్లుగా వీడియోలో కనిపిస్తోంది… పెళ్లికి ముందే దెబ్బలు పడితే.. పెళ్లి తర్వాత పరిస్థితి ఏంటో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..