ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తమ ప్రియతమ నేత సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలను వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. అయితే, మార్కాపురంలో స్థానిక ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానుల మధ్య ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి కేక్ కట్ చేశారు. సీఎం జగన్ పుట్టిన రోజును పురస్కరించుకోని ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి మార్కాపురం నియోజకవర్గంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బర్త్ డే వేడుకలు ఇంత ఘనంగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. జగన్‌పై ప్రతిపక్షాలు అర్థరహిత విమర్శలు చేస్తున్నారు అలాంటి వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పేర్కొన్నారు.
KP Nagarjuna Reddy: మార్కాపురంలో ఘనంగా సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు..
Show comments