NTV Telugu Site icon

Manu Bhaker: పీవీ సింధు ఓటమి.. మను భాకర్‌కు గోల్డెన్ ఛాన్స్!

Flag Bearer Manu Bahaker

Flag Bearer Manu Bahaker

Manu Bahaker Is a India Flag Bearer: పారిస్ ఒలింపిక్స్‌ 2024లో పతకం లక్ష్యంగా బరిలోకి దిగిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధుకు ప్రిక్వార్టర్స్‌లో చుక్కెదురైన విషయం తెలిసిందే. చైనీస్‌ ప్రపంచ నంబర్ 9 ర్యాంకర్‌ బింగ్‌ జావో రన్ చేతిలో 21-19, 21-14 తేడాతో ఓటమిపాలైంది. బ్యాడ్మింటన్ విభాగంలో పతకం పక్కా అని ఆశలు పెట్టుకున్న అభిమానులను సింధు నిరాశపరిచింది. అయితే ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన షూటర్ మను భాకర్‌కు గోల్డెన్ ఛాన్స్ దక్కింది.

Also Read: Filmfare Awards South 2024: ఉత్తమ చిత్రంగా ‘బలగం’.. కేటీఆర్‌ అభినందనలు!

ఆగస్టు 11న జరిగే పారిస్ ఒలింపిక్స్‌ ముగింపు వేడుకలో (క్లోజింగ్ సెర్మనీ) భారత పతాకధారిగా (ఫ్లాగ్‌ బేరర్‌) మను భాకర్‌ వ్యవహరించనున్నట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రకటన విడుదల చేసింది. మహిళా అథ్లెట్ల బృందానికి ఫ్లాగ్‌ బేరర్‌గా వ్యవహరించనున్నారు. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఈ హరియాణా అమ్మాయి రికార్డుల్లో నిలిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలిచిన మను.. సహచరుడు సరబ్‌జోత్‌ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు పురుష పతాకధారి ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు.