Site icon NTV Telugu

Manchu Vishnu :తన తండ్రి పుట్టినరోజున స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వనున్న మంచు విష్ణు..

Whatsapp Image 2024 03 16 At 10.51.49 Pm

Whatsapp Image 2024 03 16 At 10.51.49 Pm

మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కన్నప్ప’. శివ భక్తుడు కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు.థాయ్ ల్యాండ్ కు చెందిన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇటివల మహాశివరాత్రి సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా దీనిపై మంచు విష్ణు స్పందించి ఆనందం వ్యక్తం చేసాడు.. ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశాడు.కన్నప్ప ఫస్ట్ లుక్ పై ప్రేక్షకులు చూపిస్తున్న విశేష ఆదరణకు ధన్యవాదాలు. నిజానికి ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ముందు నేను కాస్త కంగారుపడ్డాను. ఎందుకంటే గతంలో నేను ఇలాంటి సినిమాలు ఎప్పుడు చేయలేదు. ఈ తరహా కథలో నటించడం మొదటిసారి. ఇది ఆ ఈశ్వరుడి దయ. ఆయన కథను చెప్పే అవకాశం, కన్నప్పగా నటించే అవకాశం రావడం నా అదృష్టం.

అయితే చాలా మంది కన్నప్ప చరిత్రపై నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు. తమిళ్ మరియు మలయాళి ప్రజలను నుంచి నాకు ప్రశ్నలు వస్తున్నాయి. అలాగే నార్త్ ప్రజలు కూడా అడుగుతున్నారు. ఉత్తరాది ప్రజలకు కన్నప్ప ఎవరూ, ఆయన చరిత్ర ఎంటన్నది తెలియదు. ప్రతి ఒక్కరి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కష్టం.అందుకే కన్నప్ప చరిత్ర, శ్రీకాళహస్తి గురించి అందరికి తెలిసేలా ఓ నిర్ణయం తీసుకున్నాను. మార్చి 19న ఆయన కథను తెలియజేస్తూ ఫస్ట్ వాల్యూమ్ గా కన్నప్ప పేరుతో కామిక్ బుక్ విడుదల చేస్తున్నాను.ఇదొక కథల పుస్తకం. ఆ రోజు నా తండ్రి నేను అభిమానించే నటుడు మోహన్ బాబు గారి పుట్టినరోజును పురుస్కరించుకుని ఈ బుక్ రిలీజ్ చేస్తున్నాం. ఈ పుస్తకం కావాలనుకున్నవారు ఇంస్టాగ్రామ్ లో నాకు సందేశం పంపండి. తప్పకుండ మా సిబ్బంది మీకు వాటిని పంపిస్తారు. గమనిక.. దీనికి ఎలాంటి డబ్బులు వసూలు చేయడం లేదు. ఎందుకంటే కన్నప్ప కథ అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత నాది. అందుకు ఉచితంగా కన్నప్ప బుక్స్ ను మీకు అందజేయాలనుకుంటున్నా అంటూ ఈ వీడియోలో విష్ణు తెలిపారు.

Exit mobile version