2019 వచ్చిన మలయాళ సినిమా ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25’ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించింది. రతీష్ బాలకృష్ణన్ పొదువాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూరజ్ వెంజరమూడు, సౌబిన్ షాహిర్, సూరజ్ తేలక్కడ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది తెలుగులో ‘ఆండ్రాయిడ్ కట్టప్ప’గా డబ్ అయి ‘ఆహా’లో ప్రదర్శితమవుతోంది. తండ్రి, కొడుకుల సంబంధం ప్రధానంశంగా సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన చిత్రమిది. తమిళంలో ఈ సినిమా కె.యస్. రవికుమార్ ప్రధాన పాత్రధారిగా ‘గూగుల్ కుట్టప్ప’ పేరుతో తెరకెక్కింది.
Also Read : Minister KTR : భారతదేశానికి జాతీయ భాష లేదు
ఇప్పుడు ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను నటుడు-నిర్మాత మంచు విష్ణు సొంతం చేసుకున్నాట. ఇటీవల మీడియా సమావేశంలో తెలుగు రీమేక్ వచ్చే ఏడాది జనవరి నుంచి సెట్స్‌పైకి వస్తుందన్నారు. ఈ సినిమాలో తండ్రి పాత్రలో మోహన్ బాబు నటిస్తారని తెలిపారు. కొడుకు పాత్రలో ఎవరన్నిది ఇంకా నిర్ణయించలేదని చెబుతూ తను మాత్రం చేయటం లేదన్నారు. కారణంగా తన తండ్రి అంటే ఉన్న భయమే అని వివరించారు. ప్రస్తుతం విష్ణు త్వరలో విడుదల కానున్న ‘జిన్నా’ ప్రచారంలో బిజీగా ఉన్నాడు.