NTV Telugu Site icon

Man Infected By Killer Plant : మొక్కల నుంచి మానవునికి వ్యాధులు

Man Infecter Plant

Man Infecter Plant

మొక్కల నుంచి మానవునికి వ్యాధులు సోకుతాయా అని చూసే అరుదైన సంఘటన వెలుగులోకి వచ్చింది. కోల్ కతాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రొఫెషనల్ మైకాలజిస్ట్ గా పని చేస్తున్న 61 ఏళ్ల వ్యక్తి ఈ వ్యాధి బారినపడ్డాడు. అతను కుళ్లిపోతున్న పదార్థాలు, పుట్టగొడుగులు, వివిధ మొక్కల శిలింద్రాలపై అధ్యాయనం తదితరాలు అతని పరిశోధన కార్యక్రమాల్లో భాగంగా ఉన్నాయి. ఒక రోజు సడెన్ గా ఆ వ్యక్తి గొంతు బొంగురుపోవడం, దగ్గు, అలసట కనీసం మింగ లేకపోవడం తదితర సమస్యలతో బాధపడుతున్నాడు. గత మూడు నెలలుగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాడు. ఇక చేసేది లేక డాక్టర్లను సంప్రదించగా.. ఈ అరుదైన వ్యాధి గురించి బయటపడింది.

Also Read : India- Russia: భారత్‌తో మైత్రి బలోపేతం దిశగా..

ఈ విషయాన్ని కోల్ కతాలోని కన్సల్టెంట్ అపోలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ కు చెందిన పరిశోధకులు డాక్టర్ సోమదత్తా, డాక్టర్ ఉజ్వాయిని రే తమ నివేదికలో వివరించారు. అతనికి వచ్చింది కిల్లర్ ఫ్లాంట్ ఫంగస్ అని నిర్ధారించారు. ఇది ముఖ్యంగా గులాబీ కుటుంబానికి చెందిన మొక్కజాతుల్లోని ఆకుల్లో వస్తుందని చెప్పారు. ఈ కేసు మానవులలో వ్యాధి కలిగించే పర్యావరణ మొక్కల శిలీంద్రా సామర్థ్యాన్ని హైలెట్ చేయడమే గాక కారక శిలీంద్ర జాతులను గుర్తించేందుకు పరమాణు పద్దతుల ప్రాముఖ్యతను కూడా చెబుతుందని డాక్టర్లు వెల్లడించారు.

Also Read : Pakistan : కరాచీలో తొక్కిసలాట.. 12 మంది మృతి

ఈ శిలింద్రాలను మాక్రోస్కోపిక్ లేదా మెక్రోస్కోపిక్ ద్వారా మాత్రమే గుర్తించగలమని డాక్టర్లు చెప్పారు. ఇది వ్యాప్తి చెందగలదా లేదా అన్నది తెలియాల్ని ఉందన్నారు. ఆ వ్యక్తికి ఈ ఫంగస్ కారణంగా మెడపై గడ్డ ఏర్పడిందని, దాన్ని తొలగించి యాంటి ఫంగస్ మందులతో చికిత్స చేసినట్లు తెలిపారు. రెండేళ్ల పర్యావేక్షణ అనంతరం కోలుకుని బయటపడటమే గాక పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

Show comments