Rooster Attack: ఐర్లాండ్ ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ పెంపుడు కోడి దాడికి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఐర్లాండ్‌లో జాస్పర్ క్రాస్ అనే వ్యక్తి తన పెంపుడు కోడిపుంజు దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. కోడిపుంజు దాడిలో తీవ్ర రక్తస్రావం కాగా.. అదే సమయంలో అతనికి గుండెపోటు రావడంతో గతేడాది ఏప్రిల్ 28న మృతి చెందాడు. దాదాపు సంవత్సరం గడిచాక ఈ కేసులో షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. జాస్పర్ కోడి దాడి చేసినందుకే మరణించినట్టు తెలిసింది. అంతే కాకుండా గతంలో కూడా ఆ కోడి అతడి కూతురిపై దాడికి పాల్పడిందని అతడి కూతురు తెలిపింది.
Tomato Shortage: యూకేలో తీవ్రంగా టొమాటోల కొరత.. ఖాళీగా సూపర్ మార్కెట్లు..
జాస్పర్ క్రాస్ మరణంపై ఏడాది తర్వాత విచారణ జరిగింది. ఆ కోడిపుంజు గతంలో అతడి కూతురిపై దాడి చేసిన ఆమె తండ్రి క్రాస్ తన ఇంటికి ఆ కోడిపుంజును తీసుకువచ్చినట్లు.. అనంతరం అతనిపై కూడా దాడికి పాల్పడినట్లు విచారణలో తెలిసింది. ఆ సమయంలోనే గుండెపోటు వచ్చినట్లు తేలింది. అదే ప్రాంతంలో నివసించే గార్డా ఇయోన్ బ్రౌన్ దాడి గురించి తెలుసుకున్న తర్వాత క్రాస్ ఇంటికి వచ్చి.. అతన్ని బతికించేందుకు సీపీఆర్ చేయగా.. ప్రయత్నం విఫలం అయిందని కోర్టుకు తెలిపారు. క్రాస్ ఆ సమయంలో కిచెన్‌లో రక్తపు మడుగులో నేలపై పడి ఉన్నాడని బ్రౌన్ పేర్కొన్నాడు. అతని ఒక కాలు వెనుక భాగంలో గాయం కనిపించింది. క్రాస్ పడి ఉన్న స్థలం నుంచి కోడిగూడు వరకు రక్తపు మరకలు ఉన్నట్లు బ్రౌన్ గుర్తించారు.