NTV Telugu Site icon

Mamitha Baiju : ఐశ్వర్య రాయ్ పాటకు మమితా డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూశారా?

Mamithaa

Mamithaa

ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన మలయాళం సినిమా ప్రేమలు హీరోయిన్ ఒక్క సినిమాతో యూత్ క్రష్ గా మారిపోయింది. మొదటి సినిమాతోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకొని అభిమానులలో చెరగని గుర్తింపును దక్కించుకున్న వారిలో మమత బైజు కూడా ఒకరు. ఇటీవల ప్రేమలు అనే సినిమాతో తెలుగు , మలయాళం భాషలలో ఒక్కసారిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఆమె నటనకు ఫిదా అయిన జనాలు బ్యాగ్రౌండ్ తెలుసుకోవాలని తెగ వెతికేస్తున్నారు..

ఏ ఒక్క న్యూస్ కనిపించినా తెగ వైరల్ చేస్తున్నారు.. ప్రేమలు సినిమా హిట్ అవ్వడంతో ఆమెకు సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి.. తాజాగా ఈ అమ్మడుకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ వీడియోలో మమితా ఏదో వివాహ వేడుకలలో డాన్స్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వీడియోలో మాత్రం ఈమె ఎనర్జీ కి కుర్రకారులు , అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు.

ఐశ్వర్య రాయ్ డ్యాన్స్ చేసిన నన్నారే..నన్నారే పాటకు మమిత అద్భుతమైన డ్యాన్స్ స్టెప్పులు వేసింది.. ఐశ్వర్యను మరిపించేంతగా ఆ స్టెప్పులు ఉన్నాయని అందరు కామెంట్ చేస్తున్నారు.. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవ్వడంతో ఆమె ఫ్యాన్స్ వీడియోను బాగా వైరల్ చేస్తున్నారు. ఇక ఆలస్యం ఎందుకు ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేసిందో ఒకసారి చూసేయ్యండి..