Mallojula Venugopal: జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావ్ అలియాస్ సోను దాదా ఎన్టీవీతో మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మావోయిస్టు పార్టీ హెల్ప్ లెస్ కండిషన్ లో ఉంది. నేడు సీనియర్లను కాపాడుకునే పరిస్థితిలో మావోయిస్టు పార్టీ లేదు. అందుకే నేను పార్టీలో నుంచి బయటకు వచ్చాను. సీనియర్లను సీక్రెట్ ప్లేస్ లోకి తలదాచుకోవాలని 2025 ఆగస్టు తీసుకున్న నిర్ణయం పెద్ద తప్పు. 2025 ఆగస్టులో నన్ను వ్యతిరేఖించే వారు ఒక్క తీర్మానం చేసుకున్నారు. ఆ నిర్ణయం తప్పు.. అది ఆత్మహత్యాసదృశ్యం అని నాడే వ్యతిరేఖించాను. ఎందుకంటే అడుగుబయటపెట్టాలంటే ఐడెంటిటీ లేదు.
READ ALSO: Shikhar Dhawan: గబ్బర్ కొత్త ఇన్నింగ్స్.. సోఫీతో శిఖర్ ధావన్ వెడ్డింగ్.. ఫోటోలు పంచుకున్న చాహల్!
తలదాచుకోవడం, పొరుగు ప్రాంతాలకు వెల్లాలనే నిర్ణయాలు ఆచరణ సాధ్యం కానివే, దేవ్ జీ, హిడ్మ నిర్ణయాన్ని నేను అప్పడే వ్యతిరేఖించాను. ఆధార్ కార్డు లేకుండా ఎక్కడికి పోగల్గుతాం. ఎక్కడి కి వెల్లలేరని ఆరోజే చెప్పాను. ఒడిశా నుంచి వచ్చే వరకు బస్వరాజ్ ,సతీష్ లు సాయుధ పోరాట విరమణ కోసం తీసుకున్న నిర్ణయంను కొనసాగించాను. అందరిని కలిసి చర్చించి, లొంగుబాటు నిర్ణయం తీసుకున్నాం. ఆయుధాలు వదలాలని చెప్పిన తర్వాత ఆయుధాలు అప్పగిస్తే తప్పేంటీ. నాకు ఇప్పటికీ ఆధార్ కార్డు లేదు. అప్లై చేస్తే రిజక్ట్ అయింది. అలాగే నాకు ఫోన్ కూడా లేదు, సిమ్ కార్డు లేదు.
సీనియర్లను కాపాడుకోవడం కోసం అనేక మందిని బయటకు పంపించాను. కొద్ది మంది కావాలని ఆరోపణలు చేశారు. ప్రాణత్యాగం చేసిన వారి ఆశయాలను ముందుకు తీసుకపోవడం కోసమే నేను లొంగిపోయాను. ప్రాణ త్యాగం చేసిన వారిలో మా అన్న కిషన్ జీ సైతం ఉన్నారు. త్యాగం నుంచి గుణపాఠంగా నేర్వాలి. వారందరి త్యాగఫలమే నేను బయటకు రావడం జరిగింది. మావోయిస్టు పార్టీలో కులతత్వం లేదు, వివక్ష అంతకంటే లేదు. ఎంఎల్ అంటే మాదిగోళ్లు, ఎల్ అంటే లేనోళ్ల వద్ద ఉండేదే సీపీఐ ఎంఎల్ అని నాడు కొండపల్లి సీతారామయ్య చెప్పారు. నేను బయటకు వచ్చాక చాలా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. ప్రజల మైండ్‌ను డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు.
విప్లవ పార్టీ కులం అనేది లేదు. నేను బ్రాహ్మణ్ , మహరాష్ట్ర సీఎం ఫడ్నవీస్ బ్రాహ్మణ్ అని, గడ్చిరొలి ఎస్పీ బ్రాహ్మణ్ అని మాట్లాడి కులతత్వం అంటగడుతన్నారు. నేను చెప్పిన మాట వినలేదు, బయటకు రాలేదు దాంతో కొద్ది మంది అమరులయ్యారు. రాజిరెడ్డి,దామోదర్ ,దేవ్ జీ లు జనజీవన స్రవంతిలోకి వస్తారు. మార్పుకు అతీతం ఏది కాదు, నిన్నటి రాజ్యం , ఈరోజు రాజ్యం కు తేడాలున్నాయి. ప్రజాస్వామ్యం కోసం పనిచేద్దామని ఆశిస్తున్న. 40 ఏళ్ల కింద తెలంగాణను వదిలిపెట్టాను. తెలంగాణ పరిస్థితి నాకు తెల్వదు. దండకారణ్యంలో పనిచేశాను, ఆదివాసీల్లో మార్పు వచ్చింది, ఇంకా రావాల్సి ఉంది. నేను రాజకీయాల్లోనే ఉన్నాను, ఇప్పుడు ఉన్నా, రేపు కూడా ఉంటా.
READ ALSO: Ravi Basrur: ఆ రూ.35 వేలే నా జీవితాన్ని మార్చాయి.. స్టేజ్ పైనే ఏడ్చేసిన రవి బస్రూర్!
