NTV Telugu Site icon

Maldives-India: భారత్ కు మద్దతుగా నిలిచిన మాల్దీవుల ప్రతిపక్ష పార్టీలు

Maldives India

Maldives India

Mohamed Muizzu: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదస్పద కామెంట్స్ తో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు క్షిణించిపోతున్నాయి. దీంతో మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ చైనా పర్యటన తర్వాత తన సైనికులను ఉపసంహరించుకోవాలని భారతదేశాన్ని కోరారు. దీంతో దేశవ్యాప్తంగా కూడా ఆయనపై విమర్శల పర్వం మొదలైంది. ఇక, మాల్దీవుల్లోని రెండు ప్రతిపక్ష పార్టీలు భారత్ వ్యతిరేక వైఖరిపై ముయిజ్జూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశాయి. మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (MDP), డెమొక్రాట్లు సంయుక్తంగా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. దేశ విదేశాంగ విధానంలో వచ్చిన మార్పు మాల్దీవులకు ‘అత్యంత హానికరం’ అని వారు అభివర్ణించారు.

Read Also: Budget 2024 : దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖకు కొన్ని రోజుల పాటు ‘లాక్’

అయితే, మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ- డెమొక్రాట్లు సంయూక్తంగా విడుదల చేసిన ప్రకటనలో.. మా మిత్రదేశాన్ని ( భారత్ ) వేరు చేయడం వల్ల మాల్దీవుల దీర్ఘకాలిక అభివృద్ధికి తీవ్ర నష్టం వాటిల్లుంతన్నారు. మాల్దీవుల స్థిరత్వంతో పాటు భద్రతకు హిందూ మహాసముద్రం భద్రత చాలా ముఖ్యమైంది.. దేశంలో ముయిజ్జూ ప్రభుత్వం అవలంభిస్తున్న తీరు తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌తో చారిత్రాత్మక సహకారం వైదొలగడం వల్ల దేశ సుస్థిరత, ప్రగతికి విఘాతం కలిగే అవకాశం ఉందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.

Read Also: Tirumala Temple: దర్శన టికెట్లు ఉన్న భక్తులకే తిరుమలలో గదులు!

ఇక, చైనా గూఢచారి నౌక మాల్దీవుల వైపు వెళుతోందని ఇటీవల రాయిటర్స్ నివేదిక పేర్కొంది. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ ప్రభుత్వం ఈ నౌక ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి మొదటి వారంలో చైనీస్ గూఢచారి నౌక మాలేకు చేరుకుందని వచ్చిన వార్తలపై మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ఈ ద్వీప దేశం ఎల్లప్పుడూ ‘స్నేహపూర్వక దేశాల’ నౌకలకు స్వాగతిస్తుందని ప్రకటించారు. మాల్దీవుల ఈ చర్య వల్ల భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది.