Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన “పుష్ప”ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రపంచ వ్యాప్తంగా పుష్ప సినిమాకు భారీగా కలెక్షన్స్ వచ్చాయి.ప్రస్తుతం ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ గా “పుష్ప 2 “మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమా పార్ట్ 1 కంటే మరింత భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా పుష్ప పుష్ప సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచిపోయింది.ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా నుండి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.ఈ సినిమా కోసం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఏకంగా మలేషియా సెట్ వేసినట్టు సమాచారం.అయితే ముందుగా ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర యూనిట్ మలేషియా వెళ్లాల్సి ఉంది.అయితే సినిమా విడుదల దగ్గర పడుతున్న సమయంలో అక్కడ షూటింగ్ చేయడం కష్టం అని భావించి మలేషియా సెట్ నే హైదరాబాద్ రామోజి ఫిల్మ్ సిటీలో వేసినట్లు సమాచారం.అయితే ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్,అల్లు అర్జున్ మధ్య వచ్చే సీన్స్ ఎంతో ఆసక్తికరంగా వుంటాయని సమాచారం.ఈ సారి పుష్ప 2 మూవీ భారీగా రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ఎంతో ధీమాగా ఉంది.
