NTV Telugu Site icon

Landslide : మలేషియాలో విషాదం.. కొండచరియలు విరిగిపడి 50 మంది గల్లంతు

Land Slide1

Land Slide1

Landslide : మలేషియాలో విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ రాజధాని కౌలాలంపూర్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ క్యాంప్ పై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు పొగొట్టుకున్నారు. సుమారు 50మందికి పైగా ఆచూకీ గల్లంతైనట్లు సమాచారం. గల్లంతైన వారికోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. కౌలాలంపూర్‌కు సమీపంలోని సెలాంగోర్‌ రాష్ట్రంలో శుక్రవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు.

Read Also: Rahul Gandhi : రాహుల్ భారత్‌ జోడో యాత్ర @ 100 రోజులు.. హిట్టా.. ఫట్టా

రోడ్డు పక్కన ఉన్న ఓ ఫామ్‌హౌజ్‌ను క్యాంప్‌ సౌకర్యాల కోసం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో కార్మికులు, అధికారులు క్యాంపులో నిద్రపోతున్న సమయంలో కొండచరియలు విరిగిపడినట్లు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో మొత్తం 79 మంది క్యాంప్‌లో ఉండగా అందులో 23 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇద్దరు మరణించారు. ముగ్గురు గాయాల పాలయ్యారు. 51 మంది ఆచూకీ గల్లంతయ్యారు.

Read Also:  Puri Jagannadh Temple: ఆ ఆలయంలో సెల్ ఫోన్లు నిషేధం.. జనవరి నుంచే అమలు

క్యాంప్‌ వెనకాల ఉన్న కొండ సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి విరిగిపడినట్లు విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్‌ నరోజమ్‌ ఖామిస్‌ తెలిపారు. సుమారు ఒక ఎకరం విస్తీర్ణంలో క్యాంప్‌పై కొండచరియలు పడినట్లు చెప్పారు. ఏడాది క్రితం భారీ వర్షాల కారణంగా సుమారు 21వేల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు.