Site icon NTV Telugu

Malavika Mohanan: టెంప్టింగ్ లుక్స్ తో అదరగొడుతున్న మాళవిక..

Whatsapp Image 2023 10 25 At 10.45.47 Pm

Whatsapp Image 2023 10 25 At 10.45.47 Pm

మాళవిక మోహనన్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..’పెట్టం పోలె’ అనే మలయాళీ చిత్రం తో 2013లో హీరోయిన్ గా ఈ భామ ఎంట్రీ ఇచ్చింది. మాళవిక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో ముఖ్య పాత్ర లో నటించింది. ఇటీవల మాళవిక తరచుగా ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ ఫోటోస్ షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది…ఇటీవల సోషల్ మీడియాలో మాళవిక చేస్తున్న ఫోటోషూట్స్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. దీనితో సోషల్ మీడియా లో మాళవిక మోహనన్ కు బాగా క్రేజ్ పెరిగింది..మాళవిక మోహనన్ పర్సనల్ వ్యవహారాలతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. కొన్నేళ్ల క్రితం మాళవిక బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత విక్కీ కౌశల్..కత్రినా ప్రేమ లో పడ్డాడు. 2021 లో కత్రినా, విక్కీ కౌశల్ వివాహం కూడా చేసుకున్నారు.

అయితే సోషల్ మీడియా లో మాళవిక సృష్టిస్తున్న అందాల అలజడి అంతా ఇంతా కాదు. తాజాగా మాళవిక షేర్ చేసిన ఫొటోస్ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. తెల్ల చీరలో తడి అందాలు చూపిస్తూ మాళవిక మత్తుగా ఇస్తున్న ఫోజులు అలజడి సృష్టించే విధంగా ఉన్నాయి.మాళవిక స్కిన్ టోన్ కి యువత పిచ్చెక్కిపోతున్నారు. నాభి నడుము అందాలు చూపిస్తూ మాళవిక రెచ్చగొడుతుంది.ప్రస్తుతం ఈ భామ తెలుగు మరియు తమిళ్ చిత్రాల తో బాగా బిజీ గా వుంది.సౌత్ ఇండస్ట్రీ లో ఈ భామ బాగా క్రేజ్ సంపాదించుకుంది.మాళవిక మోహన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన మారుతి దర్శకత్వం లో రాజా డీలక్స్ అనే చిత్రం లో నటిస్తున్న విషయం తెలిసిందే.ప్రభాస్ తో నటిస్తున్న ఈ సినిమా కనుక హిట్ అయితే ఈ భామకు ఓ రేంజ్ లో క్రేజ్ లభిస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు

Exit mobile version