Site icon NTV Telugu

Malavika Mohanan: ఉల్లిపొరలాంటి చీరలో ఆకట్టుకుంటున్న మలయాళి ముద్దుగుమ్మ..

Malavikaa

Malavikaa

మలయాళి ముద్దుగుమ్మ మాళవిక మోహన్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఈ అమ్మడు తాజాగా బ్యూటిఫుల్ లో కుర్రాళ్లను ఆకట్టుకుంది.. యాడ్ షూట్ కోసం చీరకట్టి మైమరిపించింది. స్టన్నింగ్ స్టిల్స్ తో మంత్రముగ్దులను చేసింది.. ట్రాన్సఫరెంట్ చీరలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు..

తన సినిమాల అప్డేట్స్ ను అందిస్తూనే మరోవైపు తన గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తోంది . కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది.. వెరైటీ ఫోటోలను దిగుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. ఇక కోలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది. అలాగే హిందీలో వరుస ఆఫర్లు అందుకుంటోంది. ఈ క్రమంలో మాళవికా మోహనన్ ఎప్పుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందనేది ఆసక్తికరంగా మారింది.. ఆమే ఎంట్రీ కోసం కుర్రాళ్లు కూడా వెయిట్ చేస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు..

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుందని తెలుస్తోంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికైతే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.. కానీ హీరోయిన్లు ఎవరు అనేది మాత్రం తెలియాల్సి ఉంది.. ఇక తాజాగా ఈ అమ్మడు ఓ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ చేసిన ఫోటో షూట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ట్రాన్స్ ఫరెంట్ శారీలో యంగ్ బ్యూటీ అందాల విందు చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది.. ఇక సినిమాల విషయానికొస్తే.. త్వరలో మాళవికా ‘తంగలాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

Exit mobile version