West Bengal : పశ్చిమ బెంగాల్‌లోని నల్పూర్ స్టేషన్ సమీపంలో సికింద్రాబాద్-షాలిమార్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పలు కోచ్‌లు పట్టాలు తప్పాయి. సౌత్-ఈస్ట్రన్ రైల్వే ప్రకారం.. B1 సహా మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి. రైల్వే సీపీఆర్వో ఓంప్రకాష్ చరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఉదయం 5.30 గంటలకు సికింద్రాబాద్-షాలిమార్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు కొన్ని కోచ్‌లు మిడిల్ లైన్ నుంచి జారి కిందకు వెళ్లాయని తెలిపారు. ఒక పార్శిల్ వ్యాన్, రెండు ప్యాసింజర్ కోచ్‌లు పట్టాలు తప్పాయి. అయితే ఎవరికీ తీవ్ర గాయాలైనట్లు సమాచారం లేదు. ప్రయాణీకుల ముందుకు వెళ్లేందుకు 10 బస్సులను ఏర్పాటు చేశారు.
Read Also:Hyderabad CP DP: సైబర్ కేటుగాళ్ల నయా దందా.. హైదరాబాద్ సీపీ డీపీతో ఫేక్ వాట్సప్ కాల్
సంత్రాగచ్చి మరియు ఖరగ్‌పూర్ నుండి ప్రమాద సహాయ రైళ్లు, మెడికల్ రిలీఫ్ రైళ్లను సహాయం కోసం వెంటనే పంపినట్లు రైల్వే తెలిపింది. ప్రయాణికులను కోల్‌కతాకు తీసుకురావడానికి చాలా బస్సులు కూడా పంపబడ్డాయి. గత ఐదేళ్లలో దేశంలో రైలు ప్రమాదాల్లో 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, సుమారు 1000 మంది గాయపడ్డారు. గత ఐదేళ్లలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దాదాపు 200 రైలు ప్రమాదాలు జరిగాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గత నెలలో మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితం ప్రతి సంవత్సరం సుమారు 171 రైలు ప్రమాదాలు జరిగేవి, ఇప్పుడు అది 40 కి తగ్గింది.
Read Also:Hemant Soren : జార్ఖండ్ లో ఐటీ దాడులు.. సీఎం సోరెన్ ప్రైవేట్ సెక్రటరీ ఆఫీసుల్లో సోదాలు