NTV Telugu Site icon

Mahesh -Rajamouli : మహేష్ -రాజమౌళి సినిమా టైటిల్ ఇదేనా?

Rajamouli Mahesh Babu

Rajamouli Mahesh Babu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి భారీ సక్సెస్ ను అందుకుంది.. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. గత కొద్ది రోజులుగా ఈ సినిమా పై రకరకాలు వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది..

ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ కోసం జర్మనీ లో పలు టెస్టులు చేశారట. స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి అవ్వడం తో ఇక ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉన్నాడు.. అయితే ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ ని మార్చేశాడు. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న పీఎస్ వినోద్ ని ఈ సినిమా కోసం తీసుకున్నారు. అలాగే ఇండోనేషియా కి చెందిన ఒక టాప్ నటిని దించబోతున్నారు జక్కన్న..

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే ఈ సినిమా టైటిల్.. రాజమౌళి స్వయంగా టైటిల్ ని అధికారిక ప్రకటన చేసేవరకు ఈ వర్కింగ్ టైటిల్ తోనే పిలవాలని అభిమానులు ఫిక్స్ అయిపోయారు.. కానీ ఇప్పుడు ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకేక్కుతున్న ఈ సినిమాకు ‘ మహారాజ్ ‘ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మహేష్ బాబు పేరు, రాజమౌళి పేరు కలుస్తుండటంతో ఇదే ఫైనల్ అవ్వొచ్చునని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందని సమాచారం..