టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో అత్యంత వైవిధ్యమైన చిత్రం ‘1 నేనొక్కడినే’. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్, విడుదలైన పదేళ్ల తర్వాత కూడా ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్‌గానే నిలిచింది. కానీ 2014లో విడుదలైన సమయంలో ఈ సినిమా కథనం అప్పటి ప్రేక్షకులకు కొంత క్లిష్టంగా అనిపించినా, కాలక్రమేణా ఇది తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రంగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా గౌతమ్ ఘట్టమనేని వెండితెరకు పరిచయమైన చిత్రం కావడంతో దీనికి మరింత ప్రత్యేకత ఉంది. అయితే మహేష్ బాబు నటనలోని ఇంటెన్సిటీ, సుకుమార్ స్క్రీన్ ప్లే మ్యాజిక్‌ను మళ్లీ బిగ్ స్క్రీన్‌పై అనుభూతి చెందాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. దీంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని మరింత క్వాలిటీతో 4K వెర్షన్‌లో రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.
లెజెండరీ యాక్టర్ కృష్ణ గారి జయంతి సందర్భంగా మే 31న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. కాగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ‘హూ ఆర్ యూ’, ‘లండన్ బాబు’ వంటి సాంగ్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో మళ్లీ హోరెత్తనున్నాయి. అలాగే రత్నవేలు విజువల్స్ హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో ఉండే సినిమాటోగ్రఫీని 4Kలో చూడటం ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమా (SSMB29) కోసం మేకోవర్ అవుతున్న తరుణంలో, ఆయన పాత బ్లాక్ బస్టర్స్ రీ-రిలీజ్ అవ్వడం ఫ్యాన్స్‌కు పెద్ద ఊరట. ఇప్పటికే ‘మురారి’ రీ-రిలీజ్ భారీ వసూళ్లు సాధించగా, ఇప్పుడు ‘1 నేనొక్కడినే’ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందోనని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
