NTV Telugu Site icon

Mahashivratri : మహాశివరాత్రి నాడు ఈ పొరపాట్లను అస్సలు చెయ్యకండి..

Sivaratri11

Sivaratri11

ప్రపంచవ్యాప్తంగా హిందువులు జరుపుకొనే పండగలలో మహాశివరాత్రి ఒకటి.. ఈ ఏడాది మహాశివరాత్రి పండుగను ఈ ఏడాది మార్చి 8న జరుపుకుంటున్నారు.. శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదని పెద్దలు చెబుతుంటారు.. ఈ రోజున శివుడి అనుగ్రహం కలగాలని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు.. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున శివరాత్రి వస్తుంది. ఈ రోజున పరమశివుడు పార్వతిల కల్యాణం జరిగింది. ఈ రోజున ప్రజలు ఉపవాసం ఉండి శివుడిని భక్తితో పూజిస్తారు.. ఈరోజున ప్రత్యేక అభిషేకాలు చేస్తే శివుడి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.. అయితే ఈ రోజు కొన్ని పొరపాట్లు అసలు చెయ్యకూడదని పండితులు చెబుతున్నారు.. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం..

పరమ శివుడు అభిషేక ప్రియుడన్న విషయం తెలిసిందే. అందుకే శివరాత్రి రోజు చాలా మంది భక్తులు లింగాభిషేకం చేస్తుంటారు. కొంతమంది నేరుగా పాల ప్యాకెట్లతోనే శివలింగానికి అభిషేకం చేస్తారు. అలా చేయవొద్దని పండితులు చెబుతున్నారు. రాగి కలశాన్ని కూడా ఉపయోగించకూడదు. మట్టి పాత్ర కానీ.. స్టీల్ పాత్రల్లో పాలను తీసుకొని అభిషేకం చేస్తే పుణ్యఫలం దక్కుతుంది.. మనం అభిషేకం చేసిన గంగాజలంతో శుభ్రం చెయ్యడం మర్చిపోకండి..

తులసీ దళాలతో అస్సలు పూజించకూడదు. బిల్వ పత్రాలు, శమీ పత్రాలను ఉపయోగించి పూజలు చేయవొచ్చు.. గోగుపూలతో అభిషేకం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.. శివపూజకు ఎప్పుడూ కుంకుమ సమర్పించకూడదు… అది నిషిద్దం. అందుకు శివాలయాల్లో చాలా వరకు విభూది ఉంటుంది… రాత్రి నక్షత్ర దర్శనం తర్వాతే ఉపవాసం వదలాలి.. అప్పటివరకు ఉపవాసం తో ఉండాలని పండితులు చెబుతున్నారు..మాంసం, మధ్యం లాంటివి తీసుకోవొద్దు. ఎవరితోనూ గొడవలు పెట్టుకోవొద్దు.. శివ నామ స్మరణ చేస్తూ ఉంటే కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు..