Site icon NTV Telugu

Bharat Jodo Yatra: రాహుల్ పాదయాత్రలో అపశృతి.. మాజీ మంత్రికి తీవ్రగాయాలు

Nitin Raut

Nitin Raut

Bharat Jodo Yatra: రెండో రోజు రాహుల్ పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. నగరంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర ఉత్సాహంగా సాగుతుంది. రాహుల్‌ను చూసేందుకు, ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రజలు పోటెత్తుతున్నారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఉదయం గాంధీయన్‌ ఐడియాలజీ సెంటర్‌ నుంచి యాత్ర ప్రారంభమైంది. నాయకులు, కార్యకర్తలు, యువతీ యువకులు పెద్ద ఎత్తన రాహుల్‌తో నడకమొదలెట్టారు.

Read Also: Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ ఇంటి ముందు ఫ్యాన్స్ హంగామా

జనం కష్టాలు వింటూ ముందుకు సాగుతున్నారు. కూకట్‌పల్లిలోని ఓ కేఫ్‌‌లో టీ తాగారు. కరాటే విద్యార్ధులతో సరదాగా మాట్లాడారు. మదీనాగూడలో లంచ్ విరామం ఇచ్చారు. రాత్రికి ముత్తంగిలో రాహుల్‌గాంధీ బసచేయనున్నారు. కాగా రాహుల్‌ను కలిసేందుకు జనం పోటెత్తుతున్నారు. దీంతో తోపులాటలు కామన్ అయిపోయాయి. ఈ క్రమంలోనే పాదయాత్రలో పాల్గొన్న మహారాష్ట్ర మాజీ ఇంధన శాఖ మంత్రి నితిన్ రౌత్‌కి గాయం అయ్యింది. రాహుల్‌తో కలిసి నడుస్తుండగా తోపులాట జరిగింది. కార్యకర్తలు ఒక్కసారిగా దూసుకొనిరావడంతో.. రౌత్ కంటికి తీవ్ర గాయం అయ్యింది. చేతులు, కాళ్లకు కూడా గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు.

Exit mobile version