ఫుడ్ వ్యాపారస్తులు అంతా ఒకలా ఆలోచిస్తే.. కొందరు మాత్రం వినూత్నంగా ఆలోచిస్తుంటారు. తమ మెదడుకు పని పెట్టి రోజూ విక్రయించే వాటినే కొత్తగా, సరికొత్తగా విక్రయిస్తుంటారు.. కొత్త రెసిఫీలను కలిపి వింత వింత తినుబండారాలను తయారు చేస్తుంటారు. ఇలాంటి చిరు వ్యాపారులు అటు ఆదాయాన్ని ఆర్జిస్తూనే.. ఇటూ సోషల్ మీడియాలోనూ ఫేమస్ అవుతుంటారు. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
ఆ వీడియోలో టిఫిన్ ను తయారు చేసే వ్యక్తి అందరిలా కాకుండా వినూత్నంగా తయారు చేయాలని అనుకున్నాడు.. రకరకాల వెరైటీ దోసలను మనం చూస్తూనే ఉంటాం.. కానీ మ్యాగీ దోసను ఎప్పుడైనా ట్రై చేశారా.. కనీసం చూశారా.. అవును మీరు విన్నది నిజమే.. కారం వెయ్యాల్సిన దోస పై మ్యాగీ వేశారు.. దానిపై రకరకాల మసాలాలు వేశారు.. మొత్తం మసాలా దోసలాగా చేశారు.. ఈ దోసకు సంబందించిన వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. అయితే ప్రస్తుతం ఒక వింతైన టిఫిన్ కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఆహారపు ప్రయోగాన్ని చూసి నెటిజన్లు బాబోయ్ ఇదేమి ఆహారం అంటూ షాక్ అవుతున్నారు..
ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఓ టిఫిన్ సెంటర్ వ్యక్తి దోసను తయారు చేస్తున్నాడు. ప్లైన్ దోస పై రసం ఉడికించిన మ్యాగీ వేసి మెదిపీ పనీర్ తురుము వేసాడు… ఆపై కాసేపు కాలిన తర్వాత పైన మరో గులాబ్ పెట్టి ఇచ్చాడు.. అయితే ఇప్పటి వరకూ ఇటువంటి దోసను తిని ఉండరు.. ఈ వింత వంటకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అవుతోంది. వీడియోను కూడా లైక్ చేసారు.. మొత్తానికి వీడియో ట్రెండ్ అవుతుంది..