Site icon NTV Telugu

Madras High Court: హీరో విజయ్‌కు మద్రాస్ హైకోర్టు షాక్

Vijay

Vijay

నటుడు, టీవీకే అధినేత విజయ్‌కు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. విజయ్‌పై విధించిన రూ.1.5 కోట్ల పన్ను జరిమానాను ధర్మాసనం సమర్థించింది. దీంతో నటుడికి భారీ షాక్ తగిలినట్లైంది.

2015-16లో రూ.15 కోట్ల ఆదాయాన్ని వెల్లడించలేదని ఆరోపిస్తూ విజయ్‌పై ఆదాయపు పన్ను శాఖ రూ.1.5 కోట్ల జరిమానా విధించింది. అయితే దీనిపై విజయ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్ విచారించిన ధర్మాసనం.. జరిమానాను సమర్థిస్తూ విజయ్ పిటిషన్ కొట్టేస్తూ తీర్పునిచ్చింది.

జనవరి 23, 2026న తీర్పును రిజర్వ్ చేసిన జస్టిస్ సెంథిల్‌కుమార్ రామమూర్తి తీర్పును శుక్రవారం వెలువరించారు. పన్ను అధికారులు జారీ చేసిన షోకాజ్ నోటీసు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 263 కింద నిర్దేశించిన కాలపరిమితిలో ఉందని.. దాని జారీలో ఎటువంటి విధానపరమైన లోపాన్ని కనుగొనలేదని కోర్టు అభిప్రాయపడింది.

 

Exit mobile version