NTV Telugu Site icon

Vijay Shah: ‘బొక్కలు విరుగుతాయ్’..గోడు చెప్పుకొన్న వ్యక్తిపై మంత్రి చిందులు

5

5

ఓ వ్యక్తి భార్య అంగన్‌వాడీ కేంద్రంలో పనిచేస్తోంది. కానీ ఆమెకు ఆరు నెలలుగా జీతం రావడం లేదు. ఇదే విషయాన్ని ఆమె భర్త.. మంత్రి ముందుకు తీసుకొచ్చాడు. ఈ విషయమై మంత్రిగారిని గట్టిగా ప్రశ్నించాడు. అంతే అటవీ శాఖ మంత్రి ఊగిపోతూ.. సదరు వ్యక్తిపై తిట్లదండకం అందుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి విజయ్‌ షా అధ్యక్షతన ఓ బహిరంగ సభ జరిగింది. ఆ సమావేశంలో ఆయన తీరుపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి.

Also Read: Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్‌ కేసులో గౌతమ్ మల్హోత్రాకు 14 రోజుల రిమాండ్

ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు మంత్రి విజయ్‌ సహనం కోల్పోయారు. కాంగ్రెస్‌ పార్టీనే అతన్ని సమావేశానికి అంతరాయం కలిగించేలా.. మద్యం తాగించి పంపించిందంటూ ఆ వ్యక్తిపై చిందులు తొక్కారు. ఈ మేరకు స్థానిక కాం‍గ్రెస్‌ నాయకుడిని ఉద్దేశించి.. “మేము మధ్యప్రదేశ్‌లో అభివృద్ధి శకానికి నాంది పలుకుతున్నాం. ఇక్కడ ఎవరైనా సీన్‌ క్రియేట్‌ చేయడానికి ప్రయత్నిస్తే వారిని అరెస్టు చేస్తాం. ఇది ప్రభుత్వ సమావేశం. దీనికి అంతరాయం కలిగించి వారి నడుములు పగిలిపోతాయ్‌” అంటూ గట్టిగా హెచ్చరించారు. దీంతో ఆయన మాటలపై విమర్శలు వస్తున్నాయి. ఇబ్బందులు ఉన్నాయని గోడు వెల్లబోసుకుంటే బెదిరిస్తారా? అంటూ పలువురు మండిపడుతున్నారు.

Also Read: M.Mareppa: జగన్ పాలనలో దళితులు, గిరిజనులకు అన్యాయం