Site icon NTV Telugu

Annamayya District: ఇంటర్ విద్యార్థినికి లైంగిక వేధింపులు.. కాలేజ్ కరస్పాండెంట్ ను చితకబాదిన తల్లిదండ్రులు

Harsh

Harsh

నేర పూరిత ప్రాంతాల్లోనే కాదు విద్యాలయాల్లో కూడా విద్యార్థినులకు రక్షణ కరువై పోయింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా అన్నమయ్య జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మదనపల్లెలో ఇంటర్ విద్యార్థినిని కాలేజ్ కరస్పాండెంట్ లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈఘటన స్థానికంగా కలకలం రేపింది. విద్యార్థినిని అసభ్యకరంగా తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. రాత్రి సమయంలో కాల్స్ అసభ్యకర మెసేజ్ లు చేస్తూ వేదించసాగాడు.

Also Read:Tata Curvv: రూ. 2 లక్షలు చెల్లించి.. టాటా కర్వ్ డీజిల్ బేస్ వేరియంట్‌ను ఇంటికి తెచ్చుకోండి!

కరస్పాండెంట్ నాగిరెడ్డి వేధింపులతో విసిగిపోయిన విద్యార్థిని ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే జూనియర్ కాలేజ్ వద్దకు చేరుకున్న బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు కాలేజ్ కరస్పాండెంట్ నాగిరెడ్డిని చితకబాదారు. కాలేజ్ కరస్పాండెంట్ నాగిరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

Exit mobile version