‘లవ్ టుడే’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన ప్రదీప్ రంగనాథన్ హీరోగా, టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘లిక్’ (Love Insurance Kompany). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంది. ప్రదీప్ మార్క్ మేనరిజమ్స్, కృతి శెట్టి గ్లామర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా విఘ్నేష్ శివన్ సినిమాల్లో ఉండే ఫన్, ఎమోషన్ దీనికి తోడు.. రాక్‌స్టార్ అనిరుద్ రవిచందర్ అందించిన పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. భవిష్యత్తులో ‘లవ్ ఇన్సూరెన్స్’ అనే కాన్సెప్ట్ ఉంటే ఎలా ఉంటుంది అనే విభిన్నమైన పాయింట్‌తో ఈ సినిమాను రూపొందించారు. ఎస్.జె. సూర్య కీలక పాత్రలో నటించడం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇక తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను కన్ఫర్మ్ చేసుకుంది.
Also Read : Hansika : హన్సిక పై మండిపడుతున్న నెటిజన్ల..
కాగా ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమేజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన పోస్టర్ ప్రకారం, ఈ సినిమా మే 15 నుండి అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ఆడియెన్స్ మే నెల మధ్యలో తమ మొబైల్స్ లోనే ఎంజాయ్ చేయొచ్చు.
