ఇండియా కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభలో ప్రతిపక్ష పాత్ర పోషించాలని నిర్ణయం తీసుకుంది. బుధవారం మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలు.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. దీంతో ప్రతిపక్షంలో కొనసాగాలని ఇండియా కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ, మోడీకి వ్యతిరేకంగా ఇండియా భాగస్వామ్య పార్టీలన్నీ ఏకతాటిపై పోరాటం చేస్తాయని మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. మోడీ నైతికంగా పరాజయం పాలయ్యారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఉందని ఖర్గే తెలిపారు. ఆయన నైతికంగా ఓడిపోయారన్నారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా, రాజకీయంగానూ నష్టపోయారని విమర్శించారు. ఇండియా కూటమిలోకి ఇతర పార్టీలను కూడా ఖర్గే ఆహ్వానించారు.
ఇది కూడా చదవండి: Rahul gandhi: రాయ్‌బరేలీ, వయనాడ్.. ఏది వదులుకుంటారు?
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతోపాటు.. శరద్ పవార్ (ఎన్సీపీ-ఎస్‌పీ), ఎంకే స్టాలిన్ (డీఎంకే), సీతారాం ఏచూరి (సీపీఎం), అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ), కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్), సంజయ్ రౌట్ (శివసేన-ఉద్ధవ్‌ఠాక్రేవర్గం), సంజయ్ సింగ్ (ఆప్), ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), అభిషేక్ బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), చంపయ్ సోరెన్ (జేఎంఎం), రాఘవ్ చద్దా (ఆప్), డి.రాజా (సీపీఐ), సుప్రియా సూలే, కల్పనా సోరెన్ సహా పలు పార్టీలకు చెందిన నేతలు సమావేశంలో పాల్గొన్నారు.
మరోవైపు ఎన్డీయే నేతలు ప్రధాని మోడీ నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి హాజరైన ఎన్డీయే పక్షాలు మోడీని కూటమిపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 7న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. నరేంద్ర మోడీ ఈనెల 9న మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
The constituents of the INDIA Bloc thank the people of India for the overwhelming support received by our alliance. The people’s mandate has given a befitting reply to the BJP and their politics of hate, corruption and deprivation. This is a political and moral defeat of Prime… pic.twitter.com/oWyQSrxWBR
— Mallikarjun Kharge (@kharge) June 5, 2024
#WATCH | Leaders of the INDIA alliance including Mallikarjun Kharge, Sonia Gandhi, Rahul Gandhi, Priyanka Gandhi Vadra, MK Stalin, Abhishek Banerjee, Tejashwi Yadav, Raghav Chadha, Sharad Pawar, D Raja, Sanjay Raut, Akhilesh Yadav, Champai Soren, Supriya Sule and others after… pic.twitter.com/0dUbSrfYfa
— ANI (@ANI) June 5, 2024
