Site icon NTV Telugu

Lok Sabha 7th Phase Election Live Updates : ఏడో దశ లోక్ సభ ఎన్నికల లైవ్ అప్డేట్స్

Polling

Polling

Lok Sabha 7th Phase Election Live Updates : ఈరోజు దేశ వ్యాప్తంగా చివరి దశ (7th ఫేజ్) ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఈ విడతలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 57లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. బీహార్ 8, చండీగఢ్ 1, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 3, ఒడిశా 6, పంజాబ్ 13, ఉత్తరప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్ 9 స్థానాలకు సహా ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకూ పోలింగ్ జరుగనుంది.

The liveblog has ended.
  • 01 Jun 2024 04:02 PM (IST)

    7వ దశ ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 49.68% ఓటింగ్ నమోదు..

    బీహార్ 42.95%
    చండీగఢ్ 52.61%
    హిమాచల్ ప్రదేశ్ 58.41%
    జార్ఖండ్ 60.14%
    ఒడిశా 49.77%
    పంజాబ్ 46.38%
    ఉత్తరప్రదేశ్ 46.83%
    పశ్చిమ బెంగాల్ 58.46%

  • 01 Jun 2024 03:52 PM (IST)

    మధ్యాహ్నం 3 గంటల వరకు 49.68 పోలింగ్ శాతం నమోదు

    లోక్‌సభ ఎన్నికల చివర దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 49.68 పోలింగ్ శాతం నమోదైంది.

  • 01 Jun 2024 01:30 PM (IST)

    మధ్యాహ్నం 1 గంటల వరకు 40.09 శాతం ఓటింగ్..

    ఏడవ దశ పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంటల వరకు 40.09 శాతం ఓటింగ్ జరిగింది. కాగా.. ఈ ఎన్నికల్లో పలువురు సీనియర్ రాజకీయ నాయకులు, నటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
    రాష్ట్రాల వారీగా ఓటింగ్ శాతం

    యూపీ 39.31
    ఒడిశా 37.64
    చండీగఢ్ 40.14
    జార్ఖండ్ 46.80
    పంజాబ్ 37.80
    పశ్చిమ బెంగాల్ 45.07
    బీహార్ 35.65
    హిమాచల్ ప్రదేశ్ 48.63

  • 01 Jun 2024 01:27 PM (IST)

    ఓటు వేసిన నటి సమైరా సంధు..

    నటి, చండీగఢ్ రాష్ట్ర ఐకాన్ సమైరా సంధు లోక్‌సభ ఎన్నికల కోసం చండీగఢ్‌లోని పోలింగ్ బూత్‌లో తన ఓటు వేశారు. సమైరా ఓటు వేసిన తర్వాత ఆమె వేలిపై చెరగని సిరా గుర్తును చూపించింది.

  • 01 Jun 2024 01:16 PM (IST)

    టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.. ఒకరికి తీవ్ర గాయాలు

    పశ్చిమ బెంగాల్‌లోని జయనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కానింగ్‌లో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇరువర్గాలు రాళ్లదాడి చేసుకున్నాయి. ఈ క్రమంలో.. ఒక వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం కోల్‌కతాలోని మెడికా సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు.

  • 01 Jun 2024 12:52 PM (IST)

    ఓటు వేసిన బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్..

    చండీగఢ్ లో 2024 లోక్‌సభ ఎన్నికల ఏడవ దశ పోలింగ్ బూత్‌లో బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్ ఓటు వేశారు.

  • 01 Jun 2024 12:40 PM (IST)

    బీజేపీ పదేళ్ల పాలనలో అవినీతి బాగా పెరిగిపోయింది- ప్రతిభా సింగ్

    హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. బీజేపీ పదేళ్ల పాలనలో అవినీతి బాగా పెరిగిపోయిందని ఆరోపించారు. బీజేపీపై ప్రజల గుండెల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయని.. దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ప్రభుత్వం రావాలని కోరారు.

  • 01 Jun 2024 11:58 AM (IST)

    ఓటు వేసిన హిమాచల్ సీఎం సుఖూ..

    హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు.. ఏడవ దశ ఓటింగ్ సందర్భంగా హమీర్‌పూర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.

  • 01 Jun 2024 11:53 AM (IST)

    ఉదయం 11 గంటల వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైందంటే..?

    దేశ వ్యాప్తంగా ఏడో దశ పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 11 గంటల వరకు 26.30 శాతం ఓటింగ్ నమోదైంది. చాలా చోట్ల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున బారులు తీరారు. హిమాచల్ ప్రదేశ్‌లో అత్యధిక ఓటింగ్ జరిగింది.
    రాష్ట్రాల వారీగా ఓటింగ్ శాతం

    యూపీ 28.02
    ఒడిశా 22.64
    చండీగఢ్ 25.03
    జార్ఖండ్ 29.55
    పంజాబ్ 23.91
    పశ్చిమ బెంగాల్ 28.10
    బీహార్ 24.25
    హిమాచల్ ప్రదేశ్ 31.92

  • 01 Jun 2024 11:10 AM (IST)

    ఓటు వేసే ముందు పూజలు చేసిన కంగనా రనౌత్..

    మండి లోక్‌సభ స్థానం నుండి బిజెపి అభ్యర్థి కంగనా రనౌత్ పోటీ చేస్తుంది. అయితే.. 2024 లోక్‌సభ ఎన్నికల ఏడవ దశ పోలింగ్ లో తన ఓటు హక్కును వినియోగించుకుంది. అనంతరం.. మండిలోని బిజెపి కార్యాలయంలో పూజలు చేశారు.

  • 01 Jun 2024 11:05 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న బీహార్ సీఎం నితీష్ కుమార్..

    2024 లోక్‌సభ ఎన్నికల చివరి దశ ఓటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఓటు వేశారు.

  • 01 Jun 2024 10:55 AM (IST)

    పంజాబ్‌లో మందకోడిగా సాగుతున్న పోలింగ్..

    పంజాబ్‌లో పోలింగ్ మందకోడిగా సాగుతుంది. ఉదయం 9 గంటల నుంచి ఎండలు తీవ్రతరం కావడంతో పోలింగ్ బూత్ లకు జనాలు రావడం తగ్గిపోయారు. ఉదయం 10 గంటల తర్వాత ముక్త్యాలలో ఎండలు దంచికొడుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత 41.28 సెల్సియస్‌కు చేరుకుంది. ఎండ వేడిమి కారణంగా చాలా చోట్ల ఓటర్లు ఇళ్ల నుంచి బయటకు రావడం మానేశారు. ప్రస్తుతం ముక్త్‌సర్‌లోని మలౌట్‌ రోడ్డులోని భాయ్‌ మస్తాన్‌ పాఠశాలలో నిర్మించిన బూత్‌లో ఒక్క ఓటరు కూడా ఓటు వేయడానికి రావడం లేదు. దాదాపు అరగంట నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది.

  • 01 Jun 2024 10:35 AM (IST)

    బెంగాల్‌లో ఓ చెరువులో దర్శనమిస్తున్న ఈవీఎంలు..

    బెంగాల్‌లో ఏడో దశ ఓటింగ్ ప్రారంభమైన 20 నిమిషాలకే ఈవీఎంలను చెరువులో పడేశారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రజలను ఓట్లు వేయకుండా అడ్డుకున్నారని స్థానిక ప్రజలు ఆరోపించారు. ఈ ఘటన దక్షిణ 24 పరగణాల జిల్లాలోని కుల్తాలీ ప్రాంతంలో చోటుచేసుకుంది.

  • 01 Jun 2024 10:20 AM (IST)

    కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో బుజ్జగింపు గురించి మాట్లాడింది: జేపీ నడ్డా

    బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. మోడీ హామీ అంటే ఆ హామీ నెరవేరుతుందని ప్రజలు గుర్తు పెట్టుకున్నారన్నారు. దేశం సురక్షితంగా ఉందని.. దేశం బలమైన ప్రభుత్వం చేతుల్లో ఉందని తెలిపారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో బుజ్జగింపు గురించి మాట్లాడిందని పేర్కొన్నారు.

  • 01 Jun 2024 10:15 AM (IST)

    బీహార్ ఊహించని ఫలితాలను ఇస్తుంది: తేజస్వి

    బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. రాజ్యాంగం, రిజర్వేషన్లు, ప్రజాస్వామ్యాన్ని రద్దు చేయాలనుకునే వారు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీహార్ షాకింగ్ ఫలితాలు ఇస్తుందని.. ఇండియా కూటమి 300 సీట్లు దాటుతుందని ధీమా వ్యక్తం చేశారు.

  • 01 Jun 2024 09:55 AM (IST)

    ఉదయం 9 గంటల వరకు 11.31 శాతం ఓటింగ్‌ నమోదు..

    దేశ వ్యాప్తంగా ఏడవ దశ పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 9 గంటల వరకు 11.31 శాతం ఓటింగ్ జరిగింది. ఈరోజు ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. కాగా.. పలువురు రాజకీయ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, అనురాగ్ ఠాకూర్, రవిశంకర్ ప్రసాద్, హర్భజన్ సింగ్, మిథున్ చక్రవర్తి సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

    రాష్ట్రాల వారీగా ఓటింగ్ శాతం
    యూపీ 12.94
    ఒడిశా 7.69
    చండీగఢ్ 11.64
    జార్ఖండ్ 12.15
    పంజాబ్ 9.64
    పశ్చిమ బెంగాల్ 12.63
    బీహార్ 10.58
    హిమాచల్ ప్రదేశ్ 14.35

  • 01 Jun 2024 09:35 AM (IST)

    ఓటేసిన బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ..

    బీహార్ మాజీ ముఖ్యమంత్రి, గయా లోక్‌సభ స్థానం నుండి పోటీ చేస్తున్న HAM అభ్యర్థి జితన్ రామ్ మాంఝీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం ఒక పెద్ద పండుగ అని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

  • 01 Jun 2024 09:08 AM (IST)

    మరోసారి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఉత్సాహంతో ఓటు వేస్తున్నారు..

    కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కేంద్రంలో భారీ ఉత్కంఠ నెలకొందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు మరోసారి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఉత్సాహంతో ఓటు వేస్తున్నారని తెలిపారు. మోడీ ప్రభుత్వ పని తీరు గురించి ప్రజలంతా మాట్లాడుతున్నారని అన్నారు.

  • 01 Jun 2024 08:40 AM (IST)

    కోల్‌కతాలో ఓటు హక్కు వినియోగించుకున్న సీపీఐ(ఎం) అభ్యర్థి సైరా దక్షిణ..

    దక్షిణ కోల్‌కతా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థి సైరా షా హలీమ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మమతా బెనర్జీ ఇక్కడ హింసను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. దీనికి ప్రజలే సమాధానం చెబుతారని తెలిపారు.

  • 01 Jun 2024 08:25 AM (IST)

    ఓటు వేసిన రబ్రీ దేవి, రోహిణి ఆచార్య..

    బీహార్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి, సరన్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థి రోహిణి ఆచార్య చివరి దశలో పాట్నాలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.

  • 01 Jun 2024 08:20 AM (IST)

    40 నిమిషాల పాటు క్యూలో నిలబడి ఓటు వేసిన మిథున్ చక్రవర్తి..

    బీజేపీ నేత, నటుడు మిథున్ చక్రవర్తి ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈరోజు నేనేమీ మాట్లాడను అంటే ఇతరులను ప్రభావితం చేస్తున్నాననే భావన కలుగుతుందన్నారు. ఓటు వేయడం తన కర్తవ్యమని.. 40 నిమిషాల పాటు లైన్‌లో నిలబడి ఓటు వేశానన్నారు. తన రాజకీయ బాధ్యతను నెరవేర్చానని మిథున్ చక్రవర్తి తెలిపారు.

  • 01 Jun 2024 08:14 AM (IST)

    ఎక్కువ మంది ఓటు వేయాలని ఆశిస్తున్నాను..

    దేశ వ్యాప్తంగా లోక్ సభ చివరి దశ పోలింగ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో.. భారత మాజీ క్రికెటర్, ఆప్ నాయకుడు హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. ఎక్కువ మంది వచ్చి ఓటు వేయాలని ఆశిస్తున్నానని తెలిపారు. జలంధర్‌లో అత్యధిక పోలింగ్ జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. ప్రజల కోసం పని చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఇది కాబట్టి ప్రతిచోటా పోలింగ్ జరగాలని ఆయన కోరారు.

  • 01 Jun 2024 08:08 AM (IST)

    ఇండియా కూటమి పేకమేడలా పడిపోతుంది- అనుప్రియ పటేల్

    దేశ వ్యాప్తంగా చివరి దశ ఎన్నికలు కొనసాగుతున్నాయి. కాగా.. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. అప్పటి వరకు వేచిచూడాలని.. అంతా తేలిపోతుందని కేంద్ర మంత్రి, మీర్జాపూర్ (అప్నా దళ్ సోనేలాల్) ఎన్డీయే అభ్యర్థి అనుప్రియ పటేల్ అన్నారు. ఇండియా కూటమి పేకమేడలా పడిపోతుందని.. దేశంలో బలమైన ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు.

  • 01 Jun 2024 07:45 AM (IST)

    మండిలో కొనసాగుతున్న ఓటింగ్.. కంగనా రనౌత్ తండ్రి ఏం చెప్పారంటే..?

    మండి బిజెపి అభ్యర్థి కంగనా రనౌత్ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో.. ఈరోజు చివరి దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. కంగనా రనౌత్ తండ్రి అమర్‌దీప్ రనౌత్ మాట్లాడుతూ.. ఈ రోజు జరుగుతున్న ఓటింగ్ ​​చాలా బాగుంది అని అన్నారు. దీపావళి మాదిరిగానే అందరూ ఎంతో ఉత్సాహంతో పోలింగ్ బూత్ లకు వస్తున్నారని తెలిపారు. ఓటర్లందరూ బయటకు వచ్చి బీజేపీకి ఓటు వేయాలని ఆయన అభ్యర్థించారు.

  • 01 Jun 2024 07:41 AM (IST)

    ఓటు వేసే ముందు రవికిషన్ పూజలు..

    గోరఖ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థి రవి కిషన్ ఓటు వేసే ముందు సంకట్ మోచన్ మండిన్‌లో ప్రార్థనలు చేశారు.

  • 01 Jun 2024 07:40 AM (IST)

    ఓటు వేసిన యోగి ఏం మాట్లాడరంటే..?

    ప్రజాస్వామ్యం యొక్క గొప్ప పండుగ చివరి దశలో ఉత్తరప్రదేశ్‌లోని 13 స్థానాలకు నేడు ఓటింగ్ నిర్వహిస్తున్నారని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ ఓటర్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు యోగి తెలిపారు.

  • 01 Jun 2024 07:30 AM (IST)

    బిలాస్‌పూర్‌లో ఓటు వేసిన జేపీ నడ్డా..

    బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. బిలాస్‌పూర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.

  • 01 Jun 2024 07:25 AM (IST)

    పోలింగ్ రోజు ప్రధాని ట్వీట్..

    దేశ వ్యాప్తంగా చివరి దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ప్రధాని మోడీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలో కూడా పోలింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా.. ప్రధాని ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు. మనమంతా కలిసి మన ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తివంతంగా, భాగస్వామ్యపూరితంగా మార్చుకుందామని తెలిపారు.

  • 01 Jun 2024 07:23 AM (IST)

    బాబా బైద్యనాథ్ ఆలయానికి షికాంత్ దూబే..

    జార్ఖండ్‌లోని గొడ్డా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి నిషికాంత్ దూబే బాబా బైద్యనాథ్ ఆలయంలో ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను దేవ్‌ఘర్‌లో ఉన్నప్పుడల్లా ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తానని.. బాబా ఆశీస్సులు ఉంటే అత్యధిక ఓట్లతో గెలుస్తానని తెలిపారు.

  • 01 Jun 2024 07:21 AM (IST)

    వారణాసి పోలింగ్‌ కేంద్రంలో మాక్‌పోల్‌..

    ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని పోలింగ్ స్టేషన్ నంబర్ 381లో మాక్ పోల్ జరుగుతోంది.

  • 01 Jun 2024 07:19 AM (IST)

    చివరి దశ ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులు పోటీ..

    దేశ వ్యాప్తంగా చివరి దశ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుంది. ఈ ఎన్నికలో ప్రధాన అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఇద్దరు కేంద్ర మంత్రులు ఆర్కే సింగ్, అనురాగ్ ఠాకూర్ పోటీలో ఉన్నారు. అలాగే.. కంగనా రనౌత్, రవి కిషన్, పవన్ సింగ్, కాజల్ నిషాద్ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

  • 01 Jun 2024 07:16 AM (IST)

    ఏడో దశలో బరిలో 904 మంది అభ్యర్థులు..

    ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఏడో దశ ఎన్నికల్లో 904 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో 809 మంది పురుషులు, 95 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.

  • 01 Jun 2024 07:15 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్..

    ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. గోరఖ్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి రవికిషన్‌, ఎస్పీ అభ్యర్థి కాజల్‌ నిషాద్‌, బీఎస్‌పీ అభ్యర్థి జావేద్‌ అష్రఫ్‌ మధ్య పోటీ నెలకొంది.

  • 01 Jun 2024 07:10 AM (IST)

    ఓటు వేసిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా..

    ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆనంద్‌పూర్ సాహిబ్ నియోజకవర్గం పరిధిలోని లఖ్‌నోర్, సాహిబ్జాదా అజిత్ సింగ్ నగర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.

Exit mobile version