ఒక్కో ప్రాంతంలో ఒక్కో డ్రింక్ స్పెషల్ గా ఉంటుంది.. అందులో కొన్నిటిని చూస్తే నోరు ఊరిపోతుంది.. మరికొన్ని డ్రింక్స్ ను చూస్తే డోకు రావడం పక్కా.. సోషల్ మీడియాలో నిత్యం ఇలాంటి వీడియోలు దర్శనమిస్తుంటాయి.. అందులో తాజాగా ఓ వీడియో వైరల్ అవుతుంది.. ఆ వీడియో చూస్తే తిన్నది మొత్తం కక్కేస్తారు.. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో చూద్దాం..
ప్రపంచంలో ఖరీదైన డ్రింక్స్ లో ఒకటి లైవ్ ఫిష్ డ్రింక్. ఇది చాలా జాగ్రత్తగా తయారు చేయాల్సిన పానీయం. ఈ డ్రింక్ ను తాగే సమయంలో చేపలు అన్నీ బతికి ఉండాల్సిందేనట.. ఈ లైవ్ ఫిష్ డ్రింక్ జపాన్ దేశంలో బాగా ఫెమస్.. ఒక కప్పు జ్యూస్ లో దాదాపు 200 చేప పిల్లలు ఉంటాయట.. అన్ని చేపలు బ్రతికే ఉంటాయట.. దీన్ని చాలా జాగ్రత్తగా తయారు చేస్తారు.. అందుకేనేమో ఇది ప్రపంచంలో కెల్లా ఖరీదైనది..
ఈ పానీయం ఒక కప్పు 60 డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపుగా 5 వేల వరకు ఉంటుంది. దీనిని డాన్సింగ్ ఈటింగ్ అని అంటారు. సోయా సాస్ లో తయారు చేసే పదార్ధాలతో కలిపి అతి చిన్న సిల్వర్ ఫిష్ ను వేసుకుని అవి బతికి ఉండగానే తాగేస్తారు. చిన్న సిల్వర్ ఫిష్ లో బ్యాక్టీరియా ఉండదట.. దీన్ని తాగేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడి తయారీదారులు చెబుతున్నారు.. ఏదైన ఆదమరిస్తే చేపలు ఎగిరిపడతాయి.. కాస్ట్ ఎక్కువైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అక్కడ ఎక్కువగా దీన్ని తాగుతారట.. ఎలా తాగుతున్నారో వీడియోలో చూడండి..