Site icon NTV Telugu

Lionel Messi: 14 ఏళ్ల తర్వాత భారత్‌కు రానున్న ఫుట్‌బాల్ రారాజు..

Lionel Messi

Lionel Messi

Lionel Messi: 14 ఏళ్ల తర్వాత భారతదేశానికి ఫుట్‌బాల్ రారాజు రాబోతున్నాడు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా.. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ. ఆయన గురువారం “GOAT (గ్రేటెస్ట్ ప్లేయర్ ఆఫ్ ఆల్ టైమ్) టూర్ ఇండియా 2025″లో పాల్గొనడాన్ని అధికారికంగా ధృవీకరించారు. భారతదేశాన్ని “ఫుట్‌బాల్-అభిమాన దేశం”గా అభివర్ణించిన ఆయన, భారత్‌ను మళ్లీ సందర్శించడం తనకు “గౌరవం” అని పేర్కొన్నారు. మెస్సీ 2011లో సాల్ట్ లేక్ స్టేడియంలో వెనిజులాతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనాకు కెప్టెన్‌గా చివరిసారిగా భారతదేశంలో ఆడాడు.

READ ALSO: Anu Emmanuel: స్టార్ హీరోల పక్కన చేసినందుకు రిగ్రెట్ ఫీలవుతున్న

భారత్ నాకు ప్రత్యేకమైన దేశం..
మెస్సీ మాట్లాడుతూ.. “భారతదేశం నాకు చాలా ప్రత్యేకమైన దేశం” అని అన్నాడు. “14 సంవత్సరాల క్రితం నేను ఇక్కడ గడిపిన సమయం గురించి నాకు ఇప్పటికీ అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. అభిమానుల ఉత్సాహం అద్భుతంగా ఉంది. ఈసారి కొత్త తరాన్ని కలవడానికి, ఫుట్‌బాల్ పట్ల నాకున్న మక్కువను పంచుకోవడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను.” అని చెప్పాడు. మెస్సీ నాలుగు రోజుల పర్యటన డిసెంబర్ 13న కోల్‌కతాలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఆయన అహ్మదాబాద్, ముంబై, న్యూఢిల్లీలకు వెళతారు. డిసెంబర్ 15న ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశంతో ఈ పర్యటన ముగుస్తుంది. ఐకానిక్ సాల్ట్ లేక్ స్టేడియంలో ఆయన కోల్‌కతా ప్రదర్శన జరుగుతుంది. అక్కడ మెస్సీ “GOAT కన్సర్ట్”, “GOAT కప్”లో పాల్గొంటాడు. సౌరవ్ గంగూలీ, బైచుంగ్ భూటియా, లియాండర్ పేస్ వంటి దిగ్గజ భారత ఆటగాళ్లు కూడా మెస్సీతో కలిసి మైదానాన్ని పంచుకోనున్నారు.

ఈ పర్యటనలో మెస్సీ కచేరీలు, ఆహార ఉత్సవాలు, ఫుట్‌బాల్ మాస్టర్‌క్లాస్‌లు, పాడిల్ ఎగ్జిబిషన్‌లు వంటి కార్యక్రమాలకు హాజరుకానున్నారు. “పాడిల్ గోట్ కప్” ముంబైలో జరుగుతుంది, ఇందులో షారుఖ్ ఖాన్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని వంటి స్టార్లు కూడా పాల్గొనవచ్చని సమాచారం. ఆసక్తికరంగా అర్జెంటీనా జాతీయ ఫుట్‌బాల్ జట్టు నవంబర్‌లో కేరళలో స్నేహపూర్వక మ్యాచ్ కూడా ఆడవచ్చని సమాచారం. ఇంకా ప్రత్యర్థి, వేదిక ఖరారు కానప్పటికీ ఇది జరిగితే మెస్సీ రెండు నెలల్లో రెండవసారి భారతదేశాన్ని సందర్శించవచ్చని అంటున్నారు. ఒలింపిక్ బంగారు పతక విజేత, 2022 ప్రపంచ కప్ ఛాంపియన్ కెప్టెన్ మెస్సీని ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఫుట్‌బాల్ ఆటగాళ్ళలో ఒకరిగా పేర్కొంటారు. భారతదేశంలో ఆయన సందర్శన ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద ఫుట్‌బాల్ సంబంధిత ఈవెంట్‌గా చెబుతున్నారు.

READ ALSO: Physics Wallah IPO: ఐపీఓకు ఫిజిక్స్ వాలా.. లిస్టింగ్ ఎప్పుడంటే?

Exit mobile version