Site icon NTV Telugu

LIC Jeevan Labh: సూపర్ స్కీమ్..రూ.253 ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ. 54 లక్షల రాబడి..

Lic

Lic

ప్రముఖ ప్రభుత్వ భీమా ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ అదిరిపోయే స్కీమ్ లను అందిస్తుంది.. తాజాగా మరో కొత్త స్కీమ్ ను అందిస్తుంది..అదే ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీ.. ఇది నాన్ లింక్డ్, పర్సనల్‌, పొదుపు ప్లాన్‌ పాలసీ. దీనితో పాటు, పాలసీ హోల్డర్ మరణంపై హామీ మొత్తం కూడా అందుబాటులో ఉంటుంది.. ఈ పాలసీ తీసుకున్న పాలసీ దారుడు ప్రమాదవ శాత్తు మరణిస్తే అతని కుటుంబానికి బీమా మొత్తంలో కనీసం 105 శాతం లభిస్తుంది. ఎల్‌ఐసీ జీవన్ లాబ్ అనేది ప్రాథమిక ఎండోమెంట్ ప్లాన్. దీనిలో మీరు అనుకున్న కాల వ్యవధి వరకు ప్రీమియం చెల్లించాలి. ఇది కాకుండా, పాలసీ మెచ్యూర్ అయినప్పుడు మెచ్యూరిటీ ప్రయోజనం లభిస్తుంది..

ఇది కనీసం రూ. 2 లక్షల హామీ మొత్తాన్ని పొందుతుంది. అదే సమయంలో, గరిష్ట మొత్తానికి ఎటువంటి పరిమితి లేదు. ఈ పాలసీలో మీరు 8 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. మీరు ఈ పాలసీలో 16 సంవత్సరాలు, 21 సంవత్సరాలు, 25 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మీరు 59 సంవత్సరాల వయస్సులో పెట్టుబడి పెట్టినట్లయితే మీరు 16 సంవత్సరాల వరకు మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు.. ఇక గరిష్ట మెచ్యూరిటీ కాలం 75 ఏళ్లు ఉంటుంది..

ఇకపోతే ఈ పాలసీకి ప్రీమియం నెల, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం పాటు కూడా చెల్లింపులు చేయవచ్చు. మీరు ప్రతిరోజూ రూ. 253 లేదా ప్రతి నెల రూ. 7700 ఇన్వెస్ట్ చేస్తే, ఒక సంవత్సరంలో రూ. 92400 ఇన్వెస్ట్ చేయడం ద్వారా, మీరు 25 సంవత్సరాల తర్వాత రూ. 54 లక్షల మెచ్యూరిటీ ప్రయోజనాన్ని పొందవచ్చు.. ఈ పాలసీ గురించి పూర్తి వివరాలను ఆన్ లైన్ లో తెలుసుకోవచ్చు లేదా.. ఎల్ఐసీ ఆఫీస్ వెళ్లి తెలుసుకోవచ్చు.. ఇవే కాదు ఎన్నో పథకాలను ఈ భీమా సంస్థ అందిస్తుంది.. అవన్నీ కూడా ప్రజాదారణ పొందిన పథకాలే.. రాబడి ఎక్కువ ..అస్సలు రిస్క్ ఉండదు..

Exit mobile version