Site icon NTV Telugu

Maoists : మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల

Maoist

Maoist

తెలంగాణ ఛత్తీస్‌గడ్ బార్డర్ లో జరిగిన ఎన్‌కౌంటర్ పైనా మరో లేఖ ను విడుదల చేశారు మావోయిస్టులు. మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేశారు. ఈ నెల 6 వ తేదీన తెలంగాణ ఛత్తీస్ ఘడ్ బార్డర్ లో ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టు మృతి చెందిన ఘటనను తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యాకాండలు నరహంతక దాడిగా అభివర్ణించారు జగన్. ఈ ముగ్గురు హత్యలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణమని ఆరోపించిన మావోయిస్టులు, ములుగు జిల్లా వెంకటాపురం మండలం పిట్టపాడ వద్ద గ్రేహౌండ్స్ పోలీసులు ఏకపక్ష కాల్పులు జరిపారని ఆరోపణలు ఈ ఘటనను వ్యతిరేకించండని పిలుపునిచ్చారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి ఛత్తీస్గడ్ రాష్ట్రం నుండి కూలీ పనులకు వచ్చిన కూలీలను బెదిరించి కొరియర్లుగా మార్చుకొని వారి సమాచారం తో ముగ్గురు కామ్రేడ్లని ఎన్కౌంటుర్ పేరుతో హత్య చేశారన్న జగన్.. ఈ నెల 6వ తేదీన తెల్లవారు జామున గ్రేహౌండ్స్ బలగాలు 5.10 నిమిషాలకు మావోయిస్టులు ఉన్న స్థలాన్ని చుట్టుముట్టి మూకుమూడిగా పోలీసు బలగాలు దాడి చేశాయని ఆరోపించారు. ఈ దాడిలో అమూల్యమైన ప్రజా వీరులు కామ్రేడ్ అన్నే సంతోష్ అలియాస్ సాగర్ శ్రీధర్, ఆప్కా మనీరం, పునేం. లక్ష్మణ్ ముగ్గురు అమరులైయ్యారని తెలిపారు. అమరులైన ముగ్గురు కామ్రేడ్స్ విప్లవ జోహార్లు చెబుతూ వారి ఆశయాలు సాధనకై పోరాడుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మావోయిస్టు అగ్ర నేత జగన్.

 

 

Exit mobile version