సంగారెడ్డి జిల్లాలో ఉదయం నుంచి ఓ చిరుత తన ప్రతాపం చూపుతోంది. Hetero పరిశ్రమలో తెల్లవారుజామున దూరిన చిరుత సంచారం కలకలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లా జిన్నారం (మం) గడ్డపోతారం పారిశ్రామిక వాడలో Hetero పరిశ్రమలో చిరుత సంచారం ఉద్యోగులను పరుగులు పెట్టిస్తోంది. Hetero పరిశ్రమలో హెచ్ బ్లాక్ లో చిరుత దాగి ఉందని తెలుస్తోంది. చిరుతను బయటకు రప్పించేందుకు అటవీ శాఖ అధికారులు సకల ప్రయత్నాలు చేస్తున్నారు.
సంఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బంది చిరుత కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో కంపెనీలోకి చిరుత ప్రవేశించిందంటున్నారు. ఆ చిరుతను బంధించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుతను బంధించేందుకు మేకను కూడా ఎరగా ఉపయోగిస్తున్నారు. హెటిరో పరిశ్రమ ల్యాబ్, పరిశ్రమ లోపం చిరుత తిరుగుతున్న దృశ్యాలు మనం చూడవచ్చు. చిరుతను ఎలాగైనా బంధిస్తామని అటవీ అధికారులు అంటున్నారు. హెటిరో సంస్థలో చిరుత వున్న ప్రాంతాలను ఎన్టీవీ బృందం పరిశీలించింది. చిరుత తిరుగుతున్న విజువల్స్, ఫోటోలను తీసింది. అటవీ సిబ్బంది హెచ్చరించినా.. సాహసోపేతంగా ఆ విజువల్స్ మీకు అందిస్తోంది. ఉదయం నుంచి ఎన్టీవీ టీం అక్కడే వుంది. అటవీ సిబ్బంది, హెటిరో సిబ్బందితో కలిసి కలియ తిరిగింది. త్వరగా చిరుతను పట్టుకోవాలని ఎన్టీవీ కోరుకుంటోంది. ఎడతెగని అన్వేషణ త్వరగా ముగియాలని, చిరుత బందీగా పట్టుబడాలని కోరుకుందాం.