NTV Telugu Site icon

Laxmi Bai: మాజీ కేంద్ర మంత్రి శివ శంకర్‌ భార్య కన్నుమూత

Sive

Sive

మాజీ కేంద్రమంత్రి, మాజీ గవర్నర్‌ శివ శంకర్‌ భార్య లక్ష్మీ బాయి (94) తుదిశ్వాస విడిచారు. గురువారం ఆమె ప్రాణాలు విడిచారు. ఆమెకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. వినయ్.. సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్. ఆమె భర్త విదేశీ వ్యవహారాల మంత్రిగా మరియు సిక్కిం మరియు కేరళ గవర్నర్‌గా ఉన్నారు. భర్త సాధించిన విజయాల్లో ఆమె కృషి వెలకట్టలేనిది. భర్త పి శివ శంకర్‌ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు, సిక్కిం గవర్నర్‌గా వ్యవహరించినప్పుడు ఆయనకు విశేష తోడ్పాటును అందించారు. దీంతో పెర్‌ఫెక్ట్‌ హోస్ట్‌గా గుర్తింపును సైతం సొంతం చేసుకున్నారు. ప్రముఖ వయోలినిస్ట్‌ ద్వారం వెంకటస్వామి నాయుడికి ఈమె మేనకోడలు.

విశాఖపట్నం జిల్లా యలమంచలి ఈమె తండ్రి స్వస్థలం కాగా, అటు తర్వాత ఒడిశాలో సెటిల్‌ అయ్యారు. ఒడిశా నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన తొలి మహిళగా లక్ష్మీ బాయి ఘనత సాధించారు. ఉత్కల్‌ యూనివర్శిటీ నుంచి బీఏ డిగ్రీ పూర్తి చేసిన లక్ష్మీబాయి.. ఆపై బెనారస్‌ యూనివర్శిటీ నుంచి పోస్టల్‌ కోర్సు ద్వారా ఎంఏ కూడా పూర్తి చేశారు. ఆమె 80 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల మధ్య వయస్సులో ఆమె రెండు పీహెచ్‌డీలు సాధించారు. 87 సంవత్సరాల వయస్సులో ఆమె చేసిన పిహెచ్‌డిలలో ఒకటి ఆమెకు బంగారు పతకాన్ని మాత్రమే కాకుండా జీవితకాల సాఫల్య పురస్కారాన్ని సాధించడంలో ఉపయోగపడింది.

Show comments