మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో, ‘శాకుంతలం’ ఫేమ్ దేవ్ మోహన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సతీ లీలావతి’. ‘భీమిలీ కబడ్డీ జట్టు’, ‘SMS’ వంటి విభిన్న చిత్రాలను అందించిన తాతినేని సత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు సమ్మర్ రేసులోకి వచ్చేసింది. నిజానికి ఈ సినిమా గతంలోనే విడుదల కావాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా చిత్రయూనిట్ క్లారిటీ ఇస్తూ..
మే 8, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్నట్లు ప్రకటించింది. “కొత్త తేదీ.. అదే ఉత్సాహం! మీ దగ్గరలోని థియేటర్లలో మే 8న కలుద్దాం” అంటూ లావణ్య తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. కాగా ఇది ఒక వినోదాత్మక ఫ్యామిలీ డ్రామా. భార్యాభర్తల మధ్య ఉండే చిన్నపాటి గొడవలు, ఆలుమగల బంధం చుట్టూ కథ సాగుతుంది. ఇందులో లావణ్య తన భర్తను తన కంట్రోల్‌లో ఉంచుకునే ఒక పవర్‌ఫుల్ వైఫ్ పాత్రలో కనిపించబోతున్నారట. ఇందులో సీనియర్ నటుడు నరేష్, సప్తగిరి, వీటీవీ గణేష్, మోట్టా రాజేంద్రన్ వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరి కాంబోలో వచ్చే కామెడీ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఫీల్ గుడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన మిక్కీ జె. మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని ‘U’ సర్టిఫికేట్ పొందిన ఈ సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ సమ్మర్ సెలవుల్లో అలరించడానికి సిద్ధమైంది.
