NTV Telugu Site icon

Central Government Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..పోస్టుల వివరాలు ఇవే..

Jobs

Jobs

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. నిన్న రైల్వే లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా హై పెర్ఫార్మెన్స్ అనలిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు… ఈ నోటిఫికేషన్ ప్రకారం..మొత్తం 64 పోస్టులను భర్తీ చేయనున్నారు.. అర్హత, ఆసక్తి కలిగిన వాళ్లు అప్లై చేసుకోవచ్చు.. దరఖాస్తుల ప్రక్రియ సెస్టెంబర్ 14వ తేదీన ప్రారంభం కాగా.. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 5, 2023గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది…

మొత్తం ఖాళీల వివరాలిలా..

1 ఫిజియోథెరపిస్ట్ 12
2 స్ట్రెంత్ & కండిషనింగ్ ఎక్స్‌పర్ట్ 28
3 ఫిజియాలజిస్ట్ 08
4 సైకాలజిస్ట్ 04
5 బయోమెకానిక్స్ 10
6 న్యూట్రిషనిస్ట్ 01
7 బయోకెమిస్ట్ 01..

అర్హతలు..

-ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాలకు ఫిజియోథెరపీలో డిగ్రీ ఉండాలి.

-స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ ఎక్స్‌పర్ట్‌ పోస్టులకు డిగ్రీ, డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్, స్పోర్ట్స్ అండ్ ఎక్సర్‌సైజ్ సైన్స్/ స్పోర్ట్స్ సైన్స్/ స్పోర్ట్స్ కోచింగ్ అండ్ ఎక్సర్సైజ్ సైన్స్/ డిగ్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి.

-ఫిజియాలజిస్ట్ పోస్టులకు మెడికల్/ హ్యూమన్/ స్పోర్ట్స్ పూర్తి చేసి ఉండాలి.

-సైకాలజిస్ట్ ఇన్ బయోలాజికల్ సైన్స్ ఉద్యోగాలకు గ్రాడ్యుయేట్ ఇన్ సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

-బయోమెకానిక్స్ ఉద్యోగాలకు గ్రాడ్యుయేట్ ఇన్ బయోమెకానిక్స్ ఉత్తీర్ణత ఉండాలి.

-న్యూట్రిషనిస్ట్ పోస్టులకు న్యూట్రిషన్ & డైటెటిక్స్ / గ్రాడ్యుయేట్ ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ చేసి ఉండాలి..

అభ్యర్థుల వయస్సు అక్టోబర్ 5, 2023 నాటికి గరిష్టంగా 45 ఏళ్లు మించకూడదు.. అలాగే దరఖాస్తులకు ఎటువంటి ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు..

జీతం..

ఎంపికైన అభ్యర్థుల యొక్క జీతం నెలకు రూ.1,05,000 చెల్లిస్తారు. అంతే కాకుండా.. ఎంపికైన అభ్యర్థులు ఇండియాలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుంది… మరిన్ని వివరాలకు అధికార వెబ్ సైట్ ను సందర్శించగలరు..

Show comments