NTV Telugu Site icon

Laptop Exploded: ల్యాప్ ట్యాప్ ను షట్ డౌన్ చేయకుండా క్లోజ్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో చూడాల్సిందే

Laptop

Laptop

Laptop Exploded: ప్రస్తుతం ఎక్కడ చూసిన మొబైల్ ఫోన్ లు, ల్యాప్ ట్యాప్ లు కామన్ అయిపోయాయి. మళ్లీ సాఫ్ట్ వేర్ బూమ్ విపరీతంగా పెరగడం, ఆ రంగంలో ఉద్యోగ అవకాశాలు విరివిగా లభించడంతో చాలా మంది ఈ జాబ్స్ చేస్తున్నారు. ఇక కరోనా పుణ్యమా అని చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇస్తున్నారు. దాంతో ఇంటి నుంచే ఎంతో సులభంగా ఉద్యోగం చేసుకుంటున్నారు. తమకు అనకూలమైన సమయంలో తమ ప్రాజెక్ట్ సంబంధించిన పనులు చేస్తున్నారు. అయితే ఇక్కడే కొంత మంది కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. వారు చేసే చిన్న తప్పు పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు. ల్యాప్ ట్యాప్ విషయంలో జాగ్రత్త అవసరం ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కొంత మంది ల్యాప్ ట్యాప్ ను షట్ డౌన్  చేయకుండా స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటాయి. అయితే అలా చేస్తే ఒక్కో సారి ల్యాప్ ట్యాప్ పేలే అవకాశం ఉంటుంది. అందుకే ల్యాప్ ట్యాప్ ఉపయోగించడం అయిపోగానే దానిని షట్ డౌన్ చేయాలి లేదా కొద్దిసేపటి తరువాత మళ్లీ ఉపయోగించాలనుకుంటే స్లీప్ మోడ్ లో పెట్టాలి. అయితే అలా పెట్టని ఓ వ్యక్తి ల్యాప్ ట్యాప్ పేలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Haryana: భారీ షాక్..పేద రైతు ఖాతాలో రూ. 200 కోట్లు

వైరల్ అవుతున్న ఈ వీడియోను బ్యాండ్ వీర్ హోలమ్(brandweerhollum) అనే ఇన్ స్టా గ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను పరిశీలిస్తే ఓ టేబుల్ పై ల్యా్ప్ ట్యాప్ పెట్టి ఉంటుంది. దానికి అప్పుడు ఛార్జింగ్ కూడా పెట్టి ఉంటారు. అయితే దానిని నుంచి సడెన్ గా పొగ వస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి వెంటనే దాని ఛార్జింగ్ కేబుల్ తీసేస్తాడు. తరువాత దానిని తెరవడానికి ప్రయత్నిస్తాడు. దీంతో ఒక్కసారిగా ల్యాప్ ట్యాప్ టప్ మని పేలి మంటలు వ్యాపిస్తాయి. దీంతో భయపడిపోయిన వ్యక్తి ఒక్కసారిగా దూరం జరుగుతాడు. అంతేకాదు ఆ మంటలు పక్కనే ఉన్న టేబుల్ కు కూడా అంటుకుంటాయి. దీంతో ఆ వ్యక్తి పెద్ద ప్రమాదం జరగకుండా ఆ మంటలను ఆర్పేస్తాడు. ఇక వెంటనే ఆ ల్యాప్ ట్యాప్ ను తీసుకొని వెళ్లి బయటపడేస్తాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ల్యాప్ ట్యాప్ క్లోజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటూ కామెంట్ చేస్తున్నారు. దీనిని లక్షల మంది చూశారు. వేల మంది లైక్ చేశారు. అయితే ల్యాప్ ట్యాప్ సడెన్ గా ఇలా పేలడం చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. బ్యాటరీ ఎందుకు పేలింది అనే విషయం గురించి చర్చిస్తున్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

Show comments